నిర్మాతగా చేసిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’తో భారీ విజయాన్ని అందుకుంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. దీని తర్వాత హారర్ ఫాంటసీ జోనర్లో ‘రాకస'(Raakaasaa) చేసింది.
సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాతో మానస శర్మ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. గెటప్ శీను, వెన్నెలకిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.
కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో ప్రీమియర్స్ షోలు కూడా వేశారు. వాటికి పాజిటివ్ టాక్ వచ్చింది.దీంతో బాక్సాఫీస్ మొదటి వారం మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో వీకెండ్ మాత్రం సొ సొగా పెర్ఫార్మ్ చేసింది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే
| తెలంగాణ | 4.04 cr |
| సీడెడ్ | 0.91 cr |
| ఆంధ్ర(టోటల్) | 3.29 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 8.24 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 2.93 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 11.17 cr(షేర్) |
‘రాకాస’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.14.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.15 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.11.17 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.19.40 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.3.83 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరో వారం రోజుల పాటు స్టెడీగా కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంటుంది.