Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
- April 3, 2026 / 11:54 PM ISTByPhani Kumar
నిర్మాతగా చేసిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’తో భారీ విజయాన్ని అందుకుంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. దీని తర్వాత హారర్ ఫాంటసీ జోనర్లో ‘రాకస'(Raakaasaa) చేసింది.
Raakaasaa
సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాతో మానస శర్మ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. గెటప్ శీను, వెన్నెలకిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

టీజర్, ట్రైలర్ వంటివి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాయి. పైగా సంగీత శోభన్ ‘మ్యాడ్’ ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలతో సూపర్ ఫామ్లో ఉండటం వల్ల ఈ సినిమాకి మంచి బిజినెస్ జరిగింది అని చెప్పాలి. వాటి వివరాలతో పాటు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసుకుందాం రండి :
| తెలంగాణ | 5 cr |
| సీడెడ్ | 2 cr |
| ఆంధ్ర(టోటల్) | 5 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 12 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 2.5 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 14.5 cr |
‘రాకాస’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.14.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.15 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. చెప్పాలంటే ఇది చిన్న టార్గెట్ అయితే కాదు. కానీ పాజిటివ్ టాక్ కనుక వస్తే సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. హర్రర్ ఫాంటసీ జోనర్ సినిమాలకి ఆ రేంజ్ సత్తా ఉంది.
‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?














