గతేడాది చివర్లో ‘వెంకీ మామ’ ‘ప్రతీరోజూ పండగే’ వంటి చిత్రాలతో రెండు సూపర్ హిట్లు అందుకుంది రాశీ ఖన్నా. అయితే ఈ ఏడాది ఆమె విజయ్ దేవరకొండకు జంటగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం మాత్రం పెద్దగా ఆడలేదు.కెరీర్ ప్రారంభం నుండీ గ్లామర్ రోల్స్ చేస్తున్నప్పటికీ … 2018 లో వచ్చిన ‘తొలిప్రేమ’ చిత్రం … రాశీ ఖన్నాలో మంచి నటి కూడా ఉందని నిరూపించింది.అంతే కాదు ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది.
‘శ్రీనివాస కళ్యాణం’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాలు పెద్దగా ఆడకపోయినా ఈమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.ఇదిలా ఉండగా…రాశీ కొద్ది రోజుల నుండీ కొత్త కొత్త ఫోటో షూట్లతో బిజీగా గడుపుతుంది. వాటిని ఇటీవల తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. సాగరకన్య స్టైల్ లో రాశీ ఈ ఫోటో షూట్లో పాల్గొంది. కె.రాఘవేంద్ర రావు గారి వంటి డైరెక్టర్ కనుక ఈ ఫోటోలను చూస్తే …
రాశీ ఖన్నా కోసం ‘సాహస వీరుడు సాగర కన్య’ వంటి స్క్రిప్ట్ ఒకటి రెడీ చేసేసినా ఆశ్చర్యపడనవసరం లేదు. అలా కాకపోతే ఈమెకు బాలీవుడ్లో ఆఫర్లు రావచ్చేమో … చెప్పలేము…! ఇక ఈ ఫోటోలైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :