తన ఫిట్ నెస్ రహస్యాన్ని వివరించిన రాశీ ఖన్నా

  • January 12, 2017 / 12:35 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం ఫిట్ బ్యూటీల హావ నడుస్తోంది. బొద్దు గుమ్మలు రెండో హీరోయిన్ గా పరిమితమవుతుంటే బాడీ ని ఫిట్ గా ఉంచుకొనే వారు టాప్ స్థాయికి చేరుకుంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్  ఈ మంత్రాన్ని జపించే టాలీవుడ్ టాప్ హీరోయిన్ జాబితాలో చోటు దక్కించుకుంది. అదే తరహాలో ఢిల్లీ సుందరి రాశీఖన్నా అడుగులు వేస్తోంది. ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత  జిల్, జోరు, శివమ్ , హైపర్, సుప్రీమ్ చిత్రాలతో బిజీ అయ్యింది. బెంగాల్ టైగర్ చిత్రంలో మాస్ మహారాజ రవితేజతో స్టెప్పులేసింది. ఆమె నటించిన ఆక్సిజన్ చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

ఊహలు గుసగుసలాడే లో బొద్దుగా కనిపించిన ఈ సుందరి రాను రాను స్లిమ్ అయి మంచి బాడీ ని దక్కించుకుంది. దీంతో కోలీవుడ్ నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. ఇప్పుడు మూడు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ మధ్య హాట్ హాట్ డ్రస్సులతో మతి పోగొడుతోంది. దీంతో ఆమెను మీ ఫిట్ నెస్ రహస్యం ఏమిటని అడగగా.. ” అందరిలాగే కొంత వ్యాయామం చేస్తాను. ఎప్పుడూ సంతోషంగా ఉంటాను. ఏ పని చేస్తున్న ఆనందంగా చేస్తుంటాను. ఆ ఫీలింగ్ నా మనసుతో పాటు బాడీ ని ఫిట్ గా ఉంచుతుందని నమ్ముతాను” అని రాశీ ఖన్నా వెల్లడించింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus