‘రంగమత్త’ క్యారెక్టర్ రిజెక్ట్ చేసింది అందుకే : రాశి

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం ‘నాన్ బాహుబలి’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఆర్టిస్ట్ కు మంచి పేరొచ్చింది. ఇక ఈ చిత్రంలో అందరికీ గుర్తుండి పోయే పాత్రల్లో ‘రంగమ్మత్త’ క్యారెక్టర్ కూడా ఒకటి. ఈ పాత్ర హాట్ యాంకర్ అనసూయ చేయడం జరిగింది. ఈ పాత్ర చేసిన అనసూయ పై ప్రశంసల వర్షం కూడా కురిసింది.

అయితే ఎవ్వరికీ తెలియని విషయం ఏమిటంటే.. ఈ పాత్రకి దర్శకుడు సుకుమార్ మొదట అనసూయను అనుకోలేదట. సీనియర్ హీరోయిన్ రాశి ను అనుకున్నాడట. ఈ పాత్రకోసం ఆమెను సంప్రదించగా.. ‘తొడల వరకూ చీర కట్టుకుని ఉండడం.. నా వల్ల కాదు. అది నాకు సెట్ అవ్వడండి. చీర కట్టుకోవడం.. చుడిదార్ కట్టుకోవడం అయితే నాకు ఓకే కానీ.. ఇలా నా వల్ల కాదు. ఆ పాత్ర అలా డిమాండ్ చేస్తుంది. కానీ నేను చేయలేను’ అని సుకుమార్ తో చెప్పిందట రాశి. ఈ విషయాన్ని ఇటీవల ‘అలీతో సరదాగా’ షోలో చెప్పుకొచ్చింది.


17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus