Radhe Shyam Movie: ‘రాధేశ్యామ్’కి కొనసాగుతున్న రీ షూట్ కష్టాలు!
- August 23, 2021 / 08:52 AM ISTByFilmy Focus
షూటింగ్ ఎన్ని రోజులున్నా ఫర్వాలేదు… అంతేకానీ షూటింగ్ జరిగినన్ని రోజులు కంటే ఎక్కువ రోజులు రీషూట్లు జరిగితే చాలా ఇబ్బంది. ఇలాంటి ఇబ్బంది అప్పుడప్పుడు కొన్ని తెలుగు సినిమాలు పడుతుంటాయి. అలాంటి సినిమాల్లో ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఒకటి. సాధారణ సినిమాగా మొదలైన ‘రాధే శ్యామ్’ తర్వాతి రోజుల్లో అసాధారణంగా తయారైంది. ప్రభాస్ ఇమేజ్ పెరగడంతో సినిమా అంచనాలు పెరిగిపోయాయి. దీంతో సినిమాకు మెరుగులు దిద్దుతూనే ఉన్నారు. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘సాహో’ అంచనాలు ఆశించిన మేర అందుకోలేదు.
దీంతో ‘రాధే శ్యామ్’ విషయంలో ఆ తప్పిదం జరగకూడదని చిత్రబృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తోంది. దీని కోసం చాలా రీషూట్లు జరిగాయని టాలీవుడ్ టాక్. మొన్నీ మధ్య సినిమా షూటింగ్ ఓవర్ అంటూ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది కూడా. అయినా ఇంకా పాచ్ వర్క్‌లు జరుగుతున్నాయట. అంతే రీషూట్లు అవుతున్నాయట.‘రాధేశ్యామ్’లో సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆయనపై ఈ సినిమా కోసం కొన్ని సీన్స్ తెరకెక్కించారట.

అయితే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా చెప్పడం లేదు. ఓవైపు వచ్చే సంక్రాంతికి వచ్చేస్తాం అంటూ చిత్రబృందం ఇటీవల జనవరి 14ను డేట్‌గా ప్రకటించింది కూడా. అలాంటిది ఇప్పుడు మళ్లీ షూట్ ఏంటో అర్థం కావడం లేదంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
#RadheyShyam movie shooting at ahobilam 🔥🥳😍✊#Prabhas pic.twitter.com/RjSzzDu7p5
— 😎PråBhÄ$ Dïë H@rD FÄÑ😎 (@DurgaNarse) August 22, 2021
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

















