Radhika: ఆ స్టార్ హీరోతో నటించాలని ఉందన్న రాధిక!

  • April 28, 2022 / 04:54 PM IST

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో ఒకరైన రాధిక తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం ద్వారా పాపులారిటీని సంపాదించుకున్నారు. అలీతో సరదాగా షోలో రాధిక మాట్లాడుతూ బాల్యంలో టామ్ బాయ్ లా పెరిగానని మా వీధిలో అబ్బాయిలను కొట్టానని అన్నారు. స్వాతిముత్యం కథ డిఫరెంట్ గా అనిపించిందని విశ్వనాథ్ గారిపై ఉన్న నమ్మకంతో ఆ సినిమాలో నటించానని రాధిక తెలిపారు.

చిరంజీవి నన్ను రౌడీ అని పిలుస్తారని ఇద్దరి కాంబినేషన్ లో 25 సినిమాలు వచ్చాయని రాధిక తెలిపారు. చిరంజీవి, నేను ఒకే సమయంలో ఇండస్ట్రీకి వచ్చామని రాధిక చెప్పుకొచ్చారు. చిరంజీవిని చూస్తే గర్వపడతానని రామ్ చరణ్ ను చూసినా అంతే గర్వపడతానని ఆమె వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ మూవీ చూశానని ఆ సినిమాలో చరణ్ యాక్టింగ్ సూపర్ అని ఆమె చెప్పుకొచ్చారు. తాను పని చేసిన మెట్టి సినిమాకు సుహాసిని కెమెరా అసిస్టెంట్ అని రాధిక తెలిపారు.

సుహసినితో అప్పుడు మొదలైన స్నేహం ఇప్పటికీ ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ జనరేషన్ లో తారక్ తనకు చాలా ఇష్టమైన నటుడని ఆమె వెల్లడించారు. తారక్ పేరు నచ్చి గ్రాండ్ సన్ కు కూడా తారక్ అని పేరు పెట్టుకున్నామని ఆమె కామెంట్లు చేశారు. తారక్ ను ఇప్పటివరకు కలవలేదని తారక్ తో నటించడం కల అని ఆమె చెప్పుకొచ్చారు. తారక్ మంచి నటుడు మాత్రమే కాదని డ్యాన్సర్ కూడా అని ఆమె వెల్లడించారు.

తెలుగులో ఇప్పుడు ఉన్న యంగ్ స్టార్స్ అంతా టాలెంటెడ్ అని చరణ్, బన్నీలను ఎత్తుకున్నానని ఆమె తెలిపారు. శరత్ కుమార్ నన్ను మామూ మామ అని పిలుస్తారని కోపం వస్తే మాత్రం రాధిక అని పేరు పెట్టి పిలుస్తారని ఆమె చెప్పుకొచ్చారు. నేను ఏ వంటకం చేసినా భర్త ఇష్టంగా తింటారని ఆయిల్ తక్కువగా ఉండే నాన్ వెజ్ వంటకాలు తన భర్తకు ఇష్టమని ఆమె వెల్లడించారు.

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus