Parineeti Chopra Wedding: ఉదయపూర్ ప్యాలెస్ లో పరిణితి చోప్రా వివాహం!

  • September 6, 2023 / 07:12 PM IST

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి పరిణితి చోప్రా ఒకరు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె మరి కొద్ది రోజులలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈమె వివాహం ఈ నెలలోనే ఉండబోతుంది అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పరిణితి రాఘవ్ చెద్ద వివాహ వేదిక, తేదీ ఖరారు అయినట్టు తెలుస్తుంది. నటి పరిమితి చోప్రా గత కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దతో ప్రేమలో ఉన్నారు.

అయితే వీరి ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరిద్దరూ కూడా ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కాబోతున్నారు. వీరి వివాహ వేడుకకు ఉదయపూర్ ప్యాలెస్ ముస్తాబవుతోంది. రాజస్థాన్ ఉదయపూర్ లోని అతి పురాతనమైనటువంటి లీలా ప్యాలెస్ లో వీరి వివాహం జరగబోతుందని తెలుస్తుంది.

ఇక వీరి వివాహ వేడుక సెప్టెంబర్ 23 24వ తేదీలలో జరగబోతుందని వెల్లడించారు. వీరి వివాహం పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో జరగబోతుందని తెలుస్తుంది. పెళ్లి వేడుకలు ఈనెల 17 నుంచే ప్రారంభం కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు రాజకీయ నాయకులు మాత్రమే హాజరు కాబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే వీరి (Parineeti Chopra )పెళ్లి వేడుక కోసం ఉదయపూర్ ప్యాలెస్ లో పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయి.

ఇక ఈ వివాహ వేడుక కోసం హాజరయ్యే అతిథులు, వీఐపీల కోసం ఉదయ్‌ పూర్‌లో విలాసవంతమైన హోటళ్లను బుక్‌ చేశారు. ఇలా అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగిన తర్వాత హర్యానాలోని గురుగ్రామ్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వివాహ వేడుకకు 200 మంది అతిథులు అలాగే 50 మందికి పైగా విఐపిలు హాజరు కాబోతున్నట్టు సమాచారం.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus