లారెన్స్ నుండి సినిమా వచ్చి మూడేళ్లు అయింది తెలుసా? ఏంటీ నమ్మడం లేదా. లారెన్స్ హీరోగా నటించి.. ఆఖరిగా వచ్చిన సినిమా ‘జిగర్తండా డబుల్ ఎక్స్’. ఆ సినిమా 2023 నవంబరులో వచ్చింది. ఆ తర్వాత ఇప్పటివరకు కొత్త సినిమా రాలేదు. కొన్ని రోజులు కొత్త సినిమా కథలు వినకుండా, సినిమాలు చేయకుండా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన ఆ గ్యాప్‌ను కవర్ చేసేయాలని ఫిక్స్ అయిపోయినట్లున్నారు. అందుకే వరుస కథలు ఓకే చేసి.. సెట్స్ మీదకు ఎక్కించేశారు. ఇంకొన్ని త్వరలో పట్టాలెక్కేస్తాయి. అలా లారెన్స్ లైనప్ మామూలుగా లేదు.
ప్రస్తుతం లారెన్స్ చేస్తున్న సినిమాల లిస్ట్.. లేటెస్ట్ సమాచారం ప్రకారం చూస్తే.. రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘కాల భైరవ’ అనే సినిమా చేస్తున్నారు. ‘మహావీర్ కర్ణ’ కూడా వీరి కాంబోలోనే ఉంది. వెట్రిమారన్ కథతో ‘అధిగారం’ అనే సినిమలో ఓకే చెప్పారు. సొంత దర్శకత్వంలో ‘దుర్గ’ అనే సినిమాను కొన్ని నెలల క్రితమే స్టార్ట్ చేశారు. వెంకట్ మోహన్ దర్శకత్వంలో ‘హంటర్’ అనే మరో సినిమాను ఇటీవల అనౌన్స్ చేసి స్టార్ట్ చేశారు.
లోకేశ్ కనగరాజ్ అందించిన కథతో ‘బెంజ్’నే మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. స్వీయ దర్శకత్వంలోనే ‘కాంచన 4’ ఉంది. అయితే ‘దుర్గ’, ఇదీ ఒకే అని మరో టాక్ కూడా ఉంది. ఇవి కాకుండా ‘బుల్లెట్’ అనే సినిమాలో ఎక్స్‌టెండెడ్ కేమియోలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. ఇలా లారెన్స్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఇవన్నీ కాకుండా తెలుగులో ఓ స్టార్ హీరోను డైరెక్ట్ చేసే పనుల్లోనూ ఉన్నారు అని మరో సమాచారం.
ఇలా రానున్న రెండు, మూడేళ్లలో వరుస సినిమాలు చేసే పనిలో ఉన్నారు లారెన్స్. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్తారు అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత ఆయనే ఇప్పుడు కాదు అంటూ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో మరికొన్ని ఏళ్లు లారెన్స్‌ను వెండితెరపై చూడొచ్చు.