పిల్లలకు పునర్జన్మ ఇస్తున్న లారెన్స్!

  • November 24, 2017 / 08:02 AM IST

ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరక్టర్ లారెన్స్ రాఘవ సాయం చేయడంలో ముందుంటారు. “ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్” ద్వారా సేవా కార్యక్రమాలను ఎప్పటి నుంచో చేస్తున్నారు. రీసెంట్ గా ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్ధి అనిత కుటుంబానికి 15 లక్షలు సాయం చేశారు. తన సంపాదనలో అధిక మొత్తాన్ని ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ కోసం కేటాయించి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.  ఇప్పటివరకు 140 చిన్నారులకి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించారు. తాజాగా శివాని అనే పాప హార్ట్ లో హోల్ ఉండటంతో ఆ పాపకి ఆపరేషన్ చేయించారు. 141 ఓపెన్ హార్ట్ సర్జరీలు ఇది కూడా సక్సెస్ అయిందంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా  లారెన్స్ తెలియ జేశారు.

“మా 141వ ఓపెన్ హార్ట్ సర్జరీ సక్సెస్ అయింది. ఆ పాప పేరు శివాని.. ఒక సంవత్సరం వయసు.. హార్ట్‌లో హోల్ ఉండటంతో ఆపరేషన్ నిర్వహించాము. పాప ప్రస్తుతం హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లిపోయింది. ఈ ఆపరేషన్లు నిర్వహిస్తున్న డాక్టర్ల బృందానికి థ్యాంక్స్. ఆపరేషన్ చేయించుకోలేని స్థితిలో మీ ఏరియాలో ఎవరైనా హార్ట్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న చిన్నారులెవరైనా ఉంటే.. వారు ఆపరేషన్ చేయించుకోలేని స్థితిలో ఉంటే ది లారెన్స్ ఛారిటబుట్ ట్రస్ట్‌ని 09790750784, 09791500866 నంబర్ల ద్వారా కాంటాక్ట్ చేయండి.” అని లారెన్స్ ట్వీట్ చేశారు. లారెన్స్ చేస్తున్న  పనికి అందరూ అభినందిస్తున్నారు. తమ వంతు సపోర్ట్ అందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus