నాగ‌శౌర్య ని ప‌రామ‌ర్శించిన ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు

ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై ఉషా మూల్పూరి నిర్మాత‌గా, శంక‌ర్ ప్ర‌సాద్ మూల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ప్రొడ‌క్ష‌న్ నెం 3 ఇటీవ‌లే వైజాగ్ షెడ్యూల్ లో హీరో నాగ‌శౌర్య కి ఎక్సిడెంట్ కి గురికావ‌టం తెలిసిన విష‌య‌మే.. దీనికి సంబందించి నాగ‌శౌర్య 15 రోజులు బెడ్‌రెస్ట్ లో త‌న నివాసం నందు వున్నారు.. ఈ విష‌యం తెలుసుకున్న ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు గారు ఈరోజు నాగ‌శౌర్య నివాసానికి విచ్చేసి ప‌రామ‌ర్శించారు. కె.రాఘ‌వేంద్ర‌రావు గారి తో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బి.వి.య‌స్ ర‌వి కూడా నాగ‌శౌర్య‌ని ప‌రామ‌ర్శించారు.ఈ సంద‌ర్బంగా

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు గారు మాట్లాడుతూ.. నాగ‌శౌర్య చాలా మంచి కుర్రాడు, స్వ‌శ‌క్తి తో త‌నేంటే ప్రూవ్ చేసుకున్న హీరోల్లో శౌర్య ఓక‌డు, సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు. అలాంటి వాడికి యాక్సిడెంట్ అయింది అన‌గానే చాలా బాధ అనిపించింది. వెంట‌నే ఫోన్ లో ప‌రామ‌ర్శించాను, కాని మ‌న‌సు ఓప్ప‌క డైర‌క్టు గా త‌న నివాసాని వ‌చ్చాను. దేవుని ద‌య‌వ‌ల‌న త్వ‌ర‌లో కొలుకోవాల‌ని షూటింగ్ లో చురుకుగా పాల్గోనాల‌ని కొరుకుంటున్నాను. నాగశౌర్య ఫ్యామిలి చాలా మంచి ఫ్యామిలి, వారంద‌రి ప్రేమ శౌర్య పై వుంటుంది. దేవుడు కృప వాళ్ళంద‌రికి వుంటుందని అశిస్తున్నాను.. అని అన్నారు.

ద‌ర్శ‌కుడు బి.వి.య‌స్ ర‌వి మాట్లాడుతూ.. నాకు శౌర్య అంటే గౌర‌వం వుంది. ఇప్ప‌డుడున్న చాలా మంది యంగ్ హీరోల్లొ శౌర్య ప్ర‌త్యేఖ‌మైన ఇమేజ్ ని సాంతం చేసుకున్నాడు. అలాంటి శౌర్య కి ఇలా జ‌ర‌గ‌టం చాలా బాద‌గా అనిపించింది. ఈరోజు త‌న నివాసం లో క‌లిసాము. ఆయ‌న‌కి వారి కుటుంబానికి మంచి జ‌ర‌గాల‌ని కొరుకుంటున్నాను.. అని అన్నారు

ప్ర‌స్తుతం నాగ‌శౌర్య త‌న సాంత బ్యాన‌ర్ లో చిత్రాన్ని చేస్తున్నాడు. ర‌మ‌ణ తేజ అనే నూత‌న ద‌ర్శ‌కుడ్ని పరిచ‌యం చేస్తున్నాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus