Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?
- June 26, 2026 / 03:00 PM ISTByFilmy Focus Desk
హిట్ కాంబినేషన్ విజయ్ దేవరకొండ – రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘రణబాలి’. ఈ సినిమాలో రష్మిక మందన కథానాయిక. ఈ కాంబినేషన్ చెబితేనే సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. అలాంటిది ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు, ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ విలన్‌గా నటిస్తున్నారు అంటే ఇంకెంత అంచనాలు పెరగాలి చెప్పండి. ఇదిలా ఉండగా ఆర్నాల్డ్, విజయ్ మధ్య వచ్చే క్లైమాక్స్ ఫైట్ సినిమాకే హైలైట్ అంటూ దర్శకుడు రాహుల్ వాటిని ఇంకా పెంచేసే ప్రయత్నం చేశారు.
Ranabaali
‘రణబాలి’ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం ప్రాణం. ఆ ఫైట్ కోసం 16 రోజులు షూటింగ్ చేశాం అని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ చెప్పారు. ఆ సీన్‌లోని డ్రామా, విజయ్ – ఆర్నాల్డ్ మధ్య ఫైట్ అద్భుతంగా ఉంటుందని ఊరించేశారాయన. విలన్ రోల్‌కు బలమైన హాలీవుడ్ నటుడు కావాలని ఏజెన్సీలను సంప్రదించాం. అయితే ఆర్నాల్డ్‌ను తీసుకోవాలని మేము మొదటి నుంచీ అనుకున్నాం. ‘ది మమ్మీ’తో మన సినిమా ప్రేక్షకులకు ఆయన తెలుసు. ఆ అంశం కలిసొస్తుందనుకున్నామని చెప్పారు..

వోస్లూ సినిమాలు చూస్తూ పెరిగాం కాబట్టి ఆయన్ని కలిసినప్పుడు ఆశ్చర్యపోయానని చెప్పారు. అదే అనుభూతి ప్రేక్షకులకూ కలుగుతుందని ఆశిస్తున్నాను అని చెప్పారు. భారతీయ సినిమాల గురించి ఆర్నాల్డ్‌కు పెద్దగా తెలియకపోయినా.. ‘RRR’ సినిమా గురించి మాట్లాడారని చెప్పారు. ఇక ‘రణబాలి’ సినిమా షూటింగ్‌లో భాగంగా ఆయన ఆరు నెలలు పాటు భారత్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లో షూటింగ్ టైమ్‌లో ఖాళీ దొరికినప్పుడు సిటీ చూశారు అని చెప్పారు రాహుల్.
ఇక ఈ సినిమా గురించి చూస్తే.. భారత చరిత్రలో అంతగా వెలుగులోకి రాని ఘట్టాల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నామని రాహుల్ ఇప్పటికే చెప్పారు. ఈ సినమాలో విజయ్ దేవరకొండ యోధుడిగా, రష్మిక మందన ఆయన సతీమణి జయమ్మగా కనిపిస్తుంది. ఇక ఈ భారీ చారిత్రక యాక్షన్ డ్రామా సినిమా సెప్టెంబరు 11, 2026న విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది..















