“డాక్టర్ అవ్వబోయి.. యాక్టర్ అయ్యాను” అనే మాట మన హీరోహీరోయిన్ల దగ్గర అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. కానీ.. నేను మాత్రం డైరెక్టర్ అవుదామని వచ్చి యాక్టర్ అయ్యాను అంటున్నాడు చాక్లేట్ బోయ్ రాహుల్ రవీంద్రన్. “అందాల రాక్షసి” సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ అందగాడు.. తర్వాత హీరోగా చేసిన సినిమాల్లో “అలా ఎలా” మినహా మరొకటి విజయం సాధించలేదు. పైగా.. మహేష్ “శ్రీమంతుడు” సినిమాలో ఓ ముఖ్యపాత్ర పోషించేసరికి.. హీరో ఆఫర్లు తగ్గిపోయి క్యారెక్టర్ రోల్స్ ఎక్కువగా వస్తుండడంతో రాహుల్ కెరీర్ కి కాస్త బ్రేక్ పడింది. పైగా ఈమధ్య వచ్చిన రాహుల్ సినిమాలు “హౌరా బ్రిడ్జ్, హైద్రాబాద్ లవ్ స్టోరీ”లు దారుణమైన పరాజయం పాలైఉండడంతో సడన్ గా దర్శకుడి అవతారమెత్తి “చి ల సౌ” అనే ప్రొజెక్ట్ మొదలెట్టాడు రాహుల్ రవీంద్రన్.
సుశాంత్ హీరోగా మొదలైన ఈ చిత్రాన్ని మొదట్లో ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకోకపోయినా టీజర్ రిలీజైన తర్వాత మాత్రం అందర్నీ విశేషమైన రీతిలో ఆకర్షించింది. అయితే.. రాహుల్ రవీంద్రన్ “చి ల సౌ” చిత్రాన్ని తెరకెక్కించిన విధానం నచ్చి ఆ సినిమాకి ప్రొడక్షన్ పార్టనర్ గా జాయినైన అన్నపూర్ణ సంస్థ ఇప్పుడు రాహుల్ రవీందర్ సెకండ్ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి కూడా ముందుకొచ్చినట్లు సమాచారం.