నాటు నాటు పాటకు రాహుల్ పారితోషికం ఎంతో తెలుసా?

నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ రావడంతో సోషల్ మీడియాలో ఈ సాంగ్ గురించి మళ్లీ చర్చ జరగడంతో పాటు నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ సాంగ్ ద్వారా రాహుల్ సిప్లిగంజ్ కు సైతం మంచి పేరు వచ్చింది. పేద కుటుంబానికి చెందిన రాహుల్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. రాహుల్ సిప్లిగంజ్ ఈ స్థాయికి ఎదగడం వెనుక కీరవాణి ప్రోత్సాహం ఎంతో ఉంది.

అయితే నాటు నాటు సాంగ్ కు రాహుల్ సిప్లిగంజ్ చాలా తక్కువ మొత్తం పారితోషికంగా అందుకున్నారు. ఈ సాంగ్ కు రాహుల్ సిప్లిగంజ్ కు 3 లక్షల రూపాయల రెమ్యునరేషన్ దక్కిందట. ఒక విధంగా ఈ మొత్తం ఎక్కువే అయినా రాహుల్ టాలెంట్ కు ఈ మొత్తం చాలా తక్కువని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నాటు నాటు సాంగ్ కు అవార్డ్ రావడంతో రాహుల్ కు ఆఫర్లు పెరిగాయి.

ఇండస్ట్రీకి చెందిన చాలామంది దర్శకులు తమ సినిమాలలో కూడా నాటు నాటు తరహా సాంగ్ కావాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ తరహా సాంగ్స్ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాటు నాటు సాంగ్ కు ఎన్నో అవార్డులు రావడం రాహుల్ కెరీర్ కు ప్లస్ అయింది.

టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని జక్కన్న అంతకంతకూ పెంచుతున్నారు. రాజమౌళి తాజాగా అమెరికాలో కూడా ఇల్లు కొనుగోలు చేశారు. రాజమౌళి అమెరికాలో స్థిరపడతారని వార్తలు వినిపిస్తున్నా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. రాజమౌళి వేగంగా సినిమాలను తెరకెక్కించి మరిన్ని అవార్డులను సొంతం చేసుకోవాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. ప్రతి ఇండస్ట్రీకి రాజమౌళి లాంటి దర్శకులు అవసరమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus