Vijay Devarakonda: టాలెంటెడ్ డైరెక్టర్స్ తో విజయ్ దేవరకొండ సినిమా!

Advertisement

ఇటీవల ‘లైగర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు విజయ్ దేవరకొండ. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా డిజాస్టర్ అయింది. కనీసపు కలెక్షన్స్ కూడా రాలేదు. రెండో రోజు నుంచే చాలా థియేటర్ల నుంచి ఈ సినిమాను తీసేశారంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తున్నారు. పూరితో చేయాలనుకున్న మరో సినిమా ‘జనగణమన’ ఆగిపోయిందని సమాచారం.

మరోపక్క విజయ్ కొత్త సినిమాలు ఒప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు, అశ్వనీదత్ లాంటి నిర్మాతలు విజయ్ తో సినిమాలు చేయడానికి ఇప్పటికే అగ్రిమెంట్స్ చేసుకున్నారు. ప్రస్తుతం దిల్ రాజు.. విజయ్ దేవరకొండ కోసం డైరెక్టర్ ని వెతికే పనిలో పడ్డారు. మరో అగ్ర నిర్మాత అశ్వనీదత్ కూడా విజయ్ కోసం చాలా కథలు వింటున్నారు. ఫైనల్ గా ఆయన కథ ఓకే చేసినట్లు తెలుస్తోంది. చిత్తూరుకి చెందిన రాజ్ అండ్ డీకే దర్శకులు బాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యారు.

ఇప్పుడు సౌత్ లో కూడా సత్తా చాటాలని చూస్తున్నారు. వారు డైరెక్ట్ చేసిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ కి ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. వీరు చాన్నాళ్లుగా విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఇటీవల కథ సిద్ధం చేసుకొని విజయ్ కి వినిపించగా.. ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. వెంటనే అశ్వనీదత్ ని కలిసి కథ చెప్పారు. ఆయనకి కథ నచ్చడంతో ప్రాజెక్ట్ సెట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus