టాలీవుడ్ రాజాలు అనగానే.. ఆ సామజిక వర్గానికి చెందిన నటీనటులేమో.. అనే ఆలోచన రావడం సహజం. అయితే మేము అటు వైపు వెళ్లలేదు. తమ నటన, డ్యాన్సులు, ఫైట్స్ తో ఎంటర్టైన్ చేసే రాజాల గురించి చెప్పబోతున్నాం. ఇంకా అర్ధం కావడం లేదా..?, రాజా పేరుతో వచ్చిన సినిమాలు గురించి అన్నమాట. ఆ సినిమాలు ఏంటో ఓ సారి లుక్కేద్దాం.
అడవి రాజాఅందగాడు శోభన్ బాబు, రాధా జంటగా నటించిన చిత్రం అడవి రాజా. పూర్తిగా అడవి నేపథ్యంలో సాగె ఈ సినిమాతో శోభాన్ బాబు అడవి రాజా గా గుర్తింపు సాధించుకున్నారు.
కిలాడీ రాజాసూపర్ స్టార్ కృష్ణ జగత్ కిలాడీలు సినిమాతో కిలాడిగా పేరు తెచ్చుకున్నారు. 1971 లో వచ్చిన చలాకి రాణి కిలాడీ రాజా మూవీతో కిలాడీ రాజా గా పిలిపించుకున్నారు.
బొబ్బిలి రాజారాజా పేరుతో ఎక్కువ సినిమాలు చేసిన తెలుగు హీరో ఎవరంటే వెంకటేష్ అని చెప్పుకోవాలి. కెరీర్ కొత్తల్లో బొబ్బిలి రాజా చేశారు. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కొండపల్లి రాజాగా పలకరించారు. అదికూడా విజయం సాధించింది. 1999 లోను రాజా గా వచ్చి హిట్ సాధించారు.
ఎక్స్ ప్రెస్ రాజావెంకటేష్ తర్వాత రాజాని తమ మూవీ టైటిల్లో ఎక్కువగా వాడుకుంది శర్వానందే. రన్ రాజా రన్ మూవీ హిట్ కావడంతో రాజా ని సెంటిమెంట్ గా పెట్టుకున్నారు. ఎక్స్ ప్రెస్ రాజా, రాజాధి రాజా గా వచ్చి విజయాలను సొంతం చేసుకున్నారు.
కొండవీటి రాజాకొండవీటికి దొంగ అయిన, రాజు అయిన చిరంజీవే. ఎందుకంటే ఆ పేరుతో వచ్చిన రెండు సినిమాలు హిట్ సాధించాయి. ముఖ్యంగా కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన కొండవీటి రాజా సినిమా చిరు ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
సెల్ఫీ రాజాహాస్య కథానాయకుడిగా అలరిస్తున్న అల్లరి నరేష్ సెల్ఫీ రాజాగా మారి నవ్వించడానికి ప్రయత్నించారు. నేటి కాలనికి తగ్గట్టు పేరుని పెట్టుకొని టాలీవుడ్ సెల్ఫీ రాజాగా ముద్రపడిపోయారు.
మాస్ మహారాజాఇది సినిమా పేరు కాదు.. రవితేజకి అభిమానులు ఇచ్చిన బిరుదు. తాజాగా మాస్ మహారాజా రాజా ది గ్రేట్ సినిమా చేయనున్నారు. దీంతో మరింతమందితో మాస్ మహారాజా గ్రేట్ అనిపించుకోనున్నారు.
వీరితో పాటు మరో ఇద్దరు రాజుల గురించి చెప్పకపోతే.. ఈ వ్యాసానికి అర్ధమే ఉండదు. వారే నాగార్జున. ప్రభాస్. కింగ్ సినిమాతో హిట్ కొట్టిన నాగార్జున తన పేరుకు ముందు ఆ పేరుని పెట్టుకున్నారు. టాలీవుడ్ కింగ్ గా నాగ్ అవతారమెత్తారు. ఇక ప్రభాస్.. రాజుల వంశములో పుట్టిన ఇతను బాహుబలి సినిమాల ద్వారా తెలుగు రాజులు ఎలా ఉంటారో ప్రపంచానికి చాటారు.