Rajamouli, Mahesh Babu: ఆ విమర్శలు జక్కన్నకు గట్టిగా తగిలాయా?

మహేష్ రాజమౌళి కాంబో మూవీ కోసం మహేష్ అభిమానులు చాలా సంవత్సరాల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ మొదలు కావాల్సి ఉన్నా రాజమౌళి బాహుబలి సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించడం, ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదా పడటంతో ఈ సినిమా ఆలస్యమైంది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ పూర్తైన వెంటనే మహేష్ రాజమౌళి కాంబో మూవీ పట్టాలెక్కనుంది. అయితే మహేష్ సినిమాను వేగంగానే పూర్తి చేయాలని జక్కన్న నిర్ణయం తీసుకున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి.

Click Here To Watch NOW

అయితే రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు ఒకే సినిమాకు హీరోలు పరిమితం కావాల్సి వస్తుందని విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మహేష్ సినిమాను మాత్రం జక్కన్న ఏడాదిలోపే పూర్తి చేయనున్నారని బోగట్టా. 2023 సంవత్సరం ఆరంభంలో ఈ సినిమా షూట్ మొదలై 2023 డిసెంబర్ నాటికి ఈ సినిమా షూట్ పూర్తి కానుందని సమాచారం. నెటిజన్ల నుంచి వ్యక్తమైన విమర్శలు గట్టిగా తగలడంతో జక్కన్న ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా షూటింగ్ సమయాన్ని జక్కన్న తగ్గించబోతున్నారని సమాచారం. అయితే బడ్జెట్, క్వాలిటీ విషయంలో మాత్రం జక్కన్న రాజీ పడే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ కంటే కొంతమేర ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. మహేష్ బాబు సినీ కెరీర్ లో ఇప్పటికే ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. అయితే ఆ సినిమాలను మించిన ఇండస్ట్రీ హిట్ గా ఈ సినిమా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఈ సినిమా తెరకెక్కనుంది. మహేష్ జక్కన్న మూవీతో పవర్ ఫుల్ రికార్డులను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్ కు ఈ సినిమాకు హైయెస్ట్ రెమ్యునరేషన్ దక్కనుండగా జక్కన్న లాభాల్లో వాటా తీసుకోనున్నారని తెలుస్తోంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus