`పెళ్ళిచూపులు` చిత్రంలో ప్రతి ఎలిమెంట్ ఎంగేజింగ్ గా ఉంది – ఎస్.ఎస్.రాజమౌళి

యువ‌త‌రం భావాల‌ను కొత్త రీతిలో చూపించిన త‌రుణ్ భాస్క‌ర్ సినిమా `పెళ్ళిచూపులు` మంచి విజ‌యాన్ని అందుకుంది. ప్రేక్ష‌కుల నుండే కాకుండా సినీ ప్ర‌ముఖుల నుండి కూడా ప్ర‌శంస‌లు అందుకుంటుంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి `పెళ్ళిచూపులు` స్పెషల్ షోను వీక్షించారు. అనంతరం ఆయన సినిమా గురించిన తన అభిప్రాయాన్ని ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేశాడు.

పెళ్లి చూపులు సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను.సినిమాలోని బ్యూటీఫుల్ మూమెంట్స్ నాకు గుర్తుకు వ‌స్తూనే ఉన్నాయి. ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం, పెర్ ఫార్మెన్స్ ఇలా అన్నీ ఎంగేజింగ్ ఉన్నాయి. త‌రుణ్‌భాస్క‌ర్ తొలి చిత్రంలోనే మంచి ఎఫ‌ర్ట్ చూపించాడు. హీరో హీరోయిన్స్ న‌ట‌న రీ ఫ్రెషింగ్‌గా అనిపించింది. నువ్వేం చేస్తున్నావ్ అని అడిగిన‌ప్పుడు ఇబ్బందిగా ఫీల‌య్యే ప్ర‌తి యువ‌కుడికి ద‌ర్శ‌కుడు మంచి స‌మాధానం ఇచ్చాడు అంటూ తెలియజేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus