Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

బ్లాక్‌బస్టర్‌ సినిమాల మెషీన్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి (Rajamouli) కలల ప్రాజెక్ట్‌ ఏంటి? దీనికి సమాధానం అందరికీ తెలిసిందే.. అదే ‘మహా భారతం’. ఆ సినిమాను పది పార్టులుగా తెరకెక్కిస్తారు అనే చర్చ కూడా చాలా రోజులుగా జరుగుతోంది. అయితే ఇది ఇప్పట్లో అయ్యే పని కాదు అని.. దీని కోసం చాలా టైమ్‌ పడుతుంది అని చెప్పారు. ఆ విషయం పక్కన పెడితే భారతీయ ఇతిహాసాలను తెరకెక్కించే విధానంపై రాజమౌళి (Rajamouli) కొన్ని ఆస్తికర కామెంట్స్‌ చేశారు. వెండితెరపై ఆ సినిమాలను చూపించిన తీరు గురించి కూడా మాట్లాడారు.

Rajamouli

తనకు ఎన్నో పౌరాణిక చిత్రాలు ఇష్టమైనప్పటికీ, గొప్ప గొప్ప గ్రంథాలకు తెరపై పూర్తి న్యాయం జరగలేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు. ఇతిహాసాలు రాసిన విధానానికి, వాటిని తెరపై చూపించిన వ్యత్యాసం ఉందని చెప్పారు. ఆ లోటే తనను చాలా ఏళ్లుగా ఆలోచింపజేస్తోందని చెప్పారు. ఈ విషయాన్ని సవాలుగా తీసుకున్నానని రాజమౌళి చెప్పారు. నేనేం చేయాలి? ఇతిహాసాలను ఎలా చూపించాలి అని నాకు నేను ప్రశ్నించుకున్నాను అని రాజమౌళి (Rajamouli) చెప్పారు.

ఆ ప్రశ్నే ఇప్పుడు తాను తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాకు ప్రధాన పాయింట్‌ అయిందని రాజమౌళి తెలిపారు. ‘వారణాసి’ సినిమాలో రామాయణ ఇతిహాసానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను పెట్టినట్లు రాజమౌళి (Rajamouli) గతంలోనే తెలిపారు. ఇప్పుడీ కామెంట్స్‌తో ఆ సన్నివేశాలపై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఆ సన్నివేశాల విషయంలో ఏమైనా ఇబ్బందులు కనిపిస్తే తన కామెంట్లు తనకే వ్యతిరేకంగా ట్రోల్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. కాబట్ట జక్కన్న జాగ్రత్తగా తెరకెక్కిస్తారనే చెప్పాలి.

మహేశ్‌ బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (Rajamouli) రూపొందిస్తున్న చిత్రం ‘వారణాసి’. ఇప్పటికే దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తి చేశాక వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేస్తారు. అయితే రాజమౌళి సినిమాలకు సంబంధించి గత కొన్నేళ్లుగా మాట మీద నిలబడని తత్వం చూశాం. పెద్ద సినిమాలు కదా.. ఆ మాత్రం ఉంటుంది. ఈ సినిమా విషయంలో ఏమవుతుందో చూడాలి.

మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus