Rajamouli: దర్శకధీరుడు జక్కన్న ఫస్ట్ యాడ్ పారితోషికం తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా మహేష్ రాజమౌళి కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరోవైపు స్టార్ డైరెక్టర్ రాజమౌళి తాజాగా ఒక యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ యాడ్ కోసం రాజమౌళి 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఒప్పోకు రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఈ యాడ్ లో జక్కన్న డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.

ఈ యాడ్ వల్ల జక్కన్నకు మరిన్ని యాడ్స్ లో నటించే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాట్ అండ్ పెప్పర్ లుక్ లో రాజమౌళి అదుర్స్ అనిపించేలా ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి రెమ్యునరేషన్ 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఇండియనా జోన్స్ తరహాలో ఉండనుందని సమాచారం అందుతోంది.

మహేష్ జక్కన్న కాంబో మూవీ 2026 సంవత్సరంలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే ఉంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ 5000 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాజమౌళి మహేష్ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమాతో బిజీ కానున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రాజమౌళి (Rajamouli) డైరెక్షన్ లో నటించాలని చాలామంది హీరోలు భావిస్తున్నారు. పవన్ రాజమౌళి, బన్నీ రాజమౌళి కాంబినేషన్ లో సినిమాలు వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాజమౌళి వేగంగా సినిమాలను తెరకెక్కించాలని రెండేళ్లకు ఒక సినిమా తెరకెక్కేలా ప్లాన్ చేసుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus