ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ బల్గెరియాలో జరుగుతుంది. అక్కడ ఎన్టీఆర్ పై కీలక యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. ఇక మరోపక్క రెండో హీరో చరణ్ కూడా కొన్ని యాక్షన్ సీన్ల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా బల్గెరియా షెడ్యూల్ కు ముందు హైదరాబాద్ లో కొంత ప్యాచ్ వర్క్ మరియు కొన్ని సీన్లని చిత్రీకరించారు. ఇక్కడి షెడ్యూల్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గెటప్ కు సంబందించిన ఓ సీన్ సినిమాలోనే హైలెట్ గా ఉండబోతుందట.
అయితే ఆ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో ఓ వ్యక్తి వీడియో తీస్తూ యూనిట్ డైరెక్టర్ అయిన కార్తికేయ(రాజమౌళి కొడుకు) కు చిక్కాడట. దీంతో కోపంతో అతని దగ్గర ఫోన్ తీసుకుని పగలకొట్టేసాడట. అసలే ‘ఆర్.ఆర్.ఆర్’ కు సంబంధించి తెగ లీకులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్… కొమరం భీమ్ అలాగే చరణ్… అల్లూరి సీతారామరాజు లుక్స్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ రాజమౌళి ప్లాన్ లో ఉన్నాడట. అందుకే ఆగష్టు 15, అలాగే వినాయక చవితి వంటి ముఖ్యమైన రోజుల్లో కూడా విడుదల చేయలేదు. ప్రస్తుతం షూటింగ్ పరిసరాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట రాజమౌళి, కార్తికేయ.