డిప్రెషన్ తో ఆత్యహత్యకు పాల్పడిన యువ రచయిత

  • May 17, 2018 / 07:07 AM IST

చిరంజీవితో “బావగారూ బాగున్నారా”, అల్లు అర్జున్ తో “రుద్రమదేవి, సరైనోడు” చిత్రాలకు రచయితగా వర్క్ చేసిన రాజసింహా తాడినాడ గత కొన్ని నెలలుగా డిప్రెషన్ తో బాధపడుతున్నారు. ఆయన దర్శకుడిగా సందీప్ కిషన్-నిత్యామీనన్ జంటగా తెరకెక్కించిన “ఒక్క అమ్మాయి తప్ప” ఫ్లాపవ్వడం, రచయితగా వేరే అవకాశాలు రాకపోవడంతో తీవ్రమైన డిప్రెషన్ కు లోనై నిన్న రాత్రి హై డోస్ స్లీపింగ్ పిల్స్ తీసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.

అదృష్టవశాత్తూ అతడు చేసిన ఆత్మహత్యాయత్నం విఫలమవ్వడంతో.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కెరీర్ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం రాజసింహ కోలుకొంటున్నాడు. ఆరోగ్యం కుదుటపడ్డాక అతడ్ని హైద్రాబాద్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus