నరేశ్ – పెళ్లి.. గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో దీని గురించే చర్చ నడుస్తోంది. పవిత్ర లోకేశ్‌తో ఆయన పెళ్లి జరిగిందంటూ ఓ వీడియో బయటకు వచ్చింది, ఆ తర్వాత దాన్ని సినిమా ప్రచారం అన్నారు. ఆ విషయం సరిగ్గా చెప్పకుండా ట్వీట్లు చేసి.. తిరిగి మీడియా మీదే సెటైర్లు వేశారు ఆయన. ఇప్పుడు నరేశ్ పెళ్లి నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేశ్ నిత్య పెళ్లి కొడుకు అంటూ ఓ సెటైర్ పేల్చారు.
దీంతో అక్కడున్న అందరూ నవ్వేశారు. ట్రోలర్స్ తన క్రియేటివిటీకి పని చెప్పారు. నరేశ్, రాజేంద్రప్రసాద్ కలసి ఓ సినిమాలో నటించారు. అదే ‘అన్నీ మంచి శకునములే..’ సినిమా ప్రచార కార్యక్రమం ఇటీవల జరిగింది. ఆ స్టేజీ మీదనే నరేశ్‌ను రాజేంద్రప్రసాద్ నిత్య పెళ్లికొడుకు అన్నారు. దాన్ని నరేశ్ చాలా సరదాగా తీసుకోవడం విశేషం. ఈ ఈవెంట్‌కు పంచెకట్టులో పెళ్లికొడుకు లాగే తయారై వచ్చాడు నరేష్.
దీంతోనే రాజేంద్రప్రసాద్ ఆ సెటైర్ వేయాల్సి వచ్చింది అని అంటున్నారు. అయితే గతంలో నరేశ్ పెళ్లి గురించి వచ్చిన పుకార్లు, వాళ్ల షికార్లు వల్ల రాజేంద్రప్రసాద్ కౌంటర్ బాగా క్లిక్ అయ్యింది, ఆ తర్వాత వైరల్ అయ్యింది. దీంతోపాటు నరేశ్ – రాజేంద్ర ప్రసాద్ మధ్య మరికొన్ని జోక్‌లు కూడా పడ్డాయి. ‘‘రెండు కత్తులు ఒక ఒరలో ఇమడవంటారు కదా.. మీరు, నరేష్ కలసి ఈ సినిమాలో నటించారు.. ఎలా?’’ అనే ప్రశ్న మీడియా నుండి రాగా.. ‘‘నేను కత్తి కాదు, నరేష్ కత్తి. నేను ఒర మాత్రమే.
నరేశ్ మామూలోడు కాదు. మీ అందరికీ తెలుసు. చూశారా.. ఎప్పుడూ పెళ్లి కొడుకు లాగానే ఉంటాడు” అంటూ నరేష్ వైపు చూస్తూ నవ్వారు రాజేంద్ర ప్రసాద్. అక్కడితో ఈ చర్చ, పంచ్‌లు ఆగిపోతే ఓకే.. కానీ రాజేంద్రుడి మాటలకు నరేష్ స్పందిస్తూ.. పెళ్లికొడుకులా ఉండటం ఏంటి, పెళ్లి కొడుకునే అనడంతో అందరూ నవ్వేశారు.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?