Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

రజనీకాంత్ (Rajinikanth) ఇన్ని సినిమాలు చేశారు.. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా సీక్వెల్‌ లేదు. అలాంటి కథలు ఆయన చేయలేదా అంటే.. సీక్వెల్‌ అవకాశం ఉన్న సినిమాలు చాలానే చేశారు. అయితే ఎందుకో కానీ ఆయనకు సీక్వెల్స్‌లో నటించడం ఇష్టం ఉండదు అని చెబుతుంటారు. గతంలో ‘బాషా 2’, ‘పేట 2’ సినిమాల ఆలోచనలు ఆయన దగ్గరకు వెళ్లినా నో చెప్పారని వార్తలొచ్చాయి. అలాంటాయన ఇప్పుడు ‘జైలర్‌’ సినిమాకు సీక్వల్‌ చేశారు. దీని వెనుక ఉన్న కారణమేంటో ఆయనే చెప్పారు.

Rajinikanth

టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా మళ్లీ తెరపై సందడి చేయడానికి ‘జైలర్ 2’ సినిమాతో రెడీ అవుతున్న రజనీకాంత్‌.. (Rajinikanth) ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడారు. సాధారణంగా నేను సినిమాల సీక్వెల్స్‌కు ఆసక్తి చూపించను. మొదటి భాగానికి కాస్త ప్లేవర్స్‌ యాడ్‌ చేసి పార్ట్‌ 2 తీస్తారని అనుకుంటూ ఉంటాను. ‘బాషా’ సినిమాకు సీక్వెల్‌కు కూడా అందుకే నో చెప్పాను. అలాగే విజయ్ సేతుపతి పాత్రను పొడిగిస్తూ ‘పేట 2’ తీస్తానని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు చెప్పినా ఓకే చెప్పలేదు.

‘జైలర్’ సినిమాను ఓటీటీలో రిలీజ్‌ అయ్యాక మరోసారి చూశా. అప్పుడు నా మనసు మారింది. ‘క్లైమాక్స్‌లో విగ్రహాల స్మగ్లర్‌ వర్మను అంతం చేసే ముందు అతడొక మాట చెబుతాడు. ఇది చాలా పెద్ద నెట్‌వర్క్‌ అని.. వాళ్లు నిన్ను అస్సలు వదిలిపెట్టరు అని అంటాడు. అందుకు తగ్గట్టే దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కూడా ఆ నెట్‌వర్క్‌ గురించి సినిమా అంతటా చిన్న చిన్న హింట్స్ ఇస్తూ వచ్చారు. రూ.వేల కోట్ల విలువైన మూడు కంటైనర్లు జైలర్ దగ్గరే ఉంటాయి ఈ పాయింట్‌ నన్ను ఆలోచింపచేసింది.

అంతేకాకుండా నాగ్‌పూర్ జైల్లో పనిచేస్తున్న సమయంలోనే కరుడుగట్టిన రౌడీలు, దాదాలకు జైలర్‌ ముత్తువేల్‌ అంటే భయం, గౌరవం. వాళ్లు జైలర్‌కు సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు, తొలి పార్టులో అవి చూశాం కూడా. ఇవన్నీ ‘జైలర్‌’ సినిమా సీక్వెల్‌కు పునాదిలా అనిపించాయి. కథలోనే సీక్వెల్‌కు కావాల్సిన ముగింపు ఉందనిపించింది. దాంతో నేనే నెల్సన్‌కి ఫోన్ చేసి ఓకే చెప్పా అని రజనీకాంత్‌ తెలిపారు.

ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus