రజనీకాంత్, మహేష్ పక్క పక్కనే షూటింగ్

  • September 6, 2016 / 10:40 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హాలిడేస్ ని బాగా ఎంజాయ్ చేశారు. వారం రోజుల క్రితం తన కుటుంబ సభ్యులతో దుబాయ్ వెళ్లిన ప్రిన్స్ అక్కడే తన కొడుకు గౌతమ్ పుట్టిన రోజుని ఘనంగా జరుపుకొని మంగళవారం నగరానికి చేరుకున్నారు. కమర్షియల్ డైరక్టర్ మురుగ దాస్ కూడా తన హిందీ  సినిమా అకిరా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. వీరిద్దరూ తమ విశ్రాంతికి గుడ్ బై చెప్పి రేపటి నుంచి యాక్షన్ లోకి దిగనున్నారు. మహేష్, మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం మొదటి షెడ్యూల్ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో విజయవంతంగా పూర్తి చేసుకుంది.

ఈ మూవీ తాజా షెడ్యూల్ రేపటి నుంచి చెన్నైలో మొదలు కానుంది. ఇందుకోసం చెన్నై ఈవీపీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేశారు. ఈ ఫిలిం సిటీలోనే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో 2.0 షూటింగ్ చేస్తున్నారు. వీరి  సెట్ పక్కనే మహేష్ సినిమా సెట్ వేశారు. రేపటి నుంచి ఇద్దరు సూపర్ స్టార్లు ఈ ఫిలిం సిటీలో సందడి చేయనున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు రజనీకాంత్ ని కలుస్తాడా ? లేదా ? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మురుగ దాస్ మాత్రం మహేష్, ఎస్.జె.సూర్యలపై భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించేందుకు సిద్ధమయ్యారు. హరీష్ జయ రాజ్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus