Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

  • February 4, 2026 / 10:03 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

మంచి చేయాలి, మంచి చేసిన వారిని అభినందించాలి. మన పెద్దలు మనకు చెప్పే పాఠాల్లో ఇదొకటి. ఈ రెండు పనులు బాగా చేసే వాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు రజనీకాంత్‌ ఒకరు. తనకు దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీని మెచ్చుకోవడంతో పాటు, ఓ బంగారు గొలుసును కానుకగా కూడా అందించారు. ఈ గౌవరం అందుకున్న కార్మికురాలలి పేరు పద్మ. చెన్నై మహానగర పాలకసంస్థలో ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు.

Rajinikanth

పద్మకు ఇటీవల రోడ్డుపై 45 తులాల బంగారం దొరికిన విషయం తెలిసిందే. వెంటనే ఆ బంగారాన్ని పోలీసులకు అప్పగించి మన్ననలు అందుకున్న ఆమెను ఇంటికి పిలిచి ఆప్యాయంగా మాట్లాడి, సన్మానించారు. మరోవైపు పద్మకు భారత తపాలా శాఖ అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమె ఫొటోతో పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ద్వారా ఆమెకు రూ.15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా అందించింది. ఆమెను అభినందిస్తూ ప్రభుత్వం తరఫున రూ.లక్ష నగదు బహుమతిని కూడా అందించారు.

ఓ ప్రైవేటు సంస్థ తరఫున గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు పద్మ. జనవరి 11న టీ నగర్‌లో విధుల్లో ఉండగా రోడ్డుపై ఓ బ్యాగు కనిపించింది. తెరిచి చూస్తే బంగారు ఆభరణాలు కనిపించాయి. వెంటనే ఆ బ్యాగును తీసుకెళ్లి పాండి బజార్‌లో పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు దర్యాప్తు చేసి ఆ బ్యాగును యజమానికి అందజేశారు. అందులోని నగల విలువ రూ.45 లక్షలు అని అప్పుడు తెలిసింది.

పద్మ జీవితంలో ఇలాంటి నిజాయతి పని ఇంకొకటి ఉంది. కరోనా సమయంలో పద్మ భర్త సుబ్రమణి మెరీనా బీచ్‌ సమీపంలో పారిశుద్ధ్య పనులు చేస్తుండగా రూ.1.5 లక్షల నగదు దొరికింది. అప్పుడు ఆయన కూడా ఆ డబ్బును పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు పద్మ ఇలా తన నిజాయతి నిరూపించుకున్నారు. దీనికి గాను ఆమెను ఎంత ప్రశంసించినా తక్కువే.

‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajinikanth

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

20 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

21 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

2 days ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

3 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

5 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

6 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

18 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

19 hours ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version