Rajinikanth Remuneration: రజనీ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తేస్ షాకవ్వాల్సిందే!

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రజనీకాంత్ కు ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోయినా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రజనీకాంత్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఏ రేంజ్ లో బాక్సాఫీస్ షేక్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా కోసం రజనీకాంత్ రోజుకు 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

సౌత్ ఇండియాలో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడం రజనీకాంత్ కు మాత్రమే సాధ్యమైందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. లాల్ సలామ్ అనే సినిమా కోసం రజనీకాంత్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ సినిమా కోసం రజనీకాంత్ వారం రోజుల పాటు డేట్లు ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాలో ముస్లిం రోల్ లో రజనీకాంత్ కనిపించనున్నారు.

రజనీకాంత్ తన రెమ్యునరేషన్ తో రికార్డులు సృష్టిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్న రజనీకాంత్ ఆ సినిమాతో పాటు లాల్ సలామ్ సినిమాలో కూడా నటిస్తున్నారు. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. రజనీకాంత్ జై భీమ్ డైరెక్టర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారని సమాచారం అందుతోంది.

ఐశ్వర్య ఈ సినిమాతో దర్శకురాలిగా సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. మొదట ఈ సినిమాలో రజనీకాంత్ ఫ్రీగా నటిస్తారని ప్రచారం జరగగా ఆ ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా ఈ సినిమాలో నటిస్తుండటం గమనార్హం. రజనీకాంత్ టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమా సినిమాకు రజనీకాంత్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus