Rajinikanth,KGF2: బ్లాక్‌బస్టర్‌ ‘కేజీయఫ్‌ 2’ చూసిన రజనీకాంత్‌!

Advertisement

అది ఎవరి సినిమా అయినా.. రిలీజ్‌ అవ్వగానే సినిమా చూసి ఫోన్‌ చేసి మరీ అభినందించడం మన స్టార్‌ హీరోలకు అలవాటు. ఇలాంటి స్టార్‌ హీరోలు మన దగ్గర చాలామంది ఉన్నారు. అలాంటివారిలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఒకరు. అది ఏ ఇండస్ట్రీ సినిమా అయినా సరే… చూసి మరీ అభినందిస్తుంటారు. అలా ఆయన రీసెంట్‌గా ‘కేజీయఫ్‌ 2’ సినిమా చూశారట. అంతేకాదు ఆ టీమ్‌ను అభినందించారు కూడా. ఈ విషయంలో ఆయన సన్నిహితులు వెల్లడించారు.

Click Here To Watch NOW

కన్నడ పరిశ్రమలో ఓ సినిమా మొదలై… ఏకంగా పాన్‌ ఇండియా మూవీగా మారిపోయింది ‘కేజీయఫ్‌’. తొలి పార్ట్‌కి వచ్చిన రెస్పాన్స్‌కి డబుల్, ట్రిపుల్‌ రెస్పాన్స్‌ ఇప్పుడు రెండో పార్ట్‌కి వస్తోంది. అందుకే విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 500 కోట్లకుపైగా వసూలు చేసి వావ్‌ అనిపిస్తోంది. అలాంటి సినిమాను రజనీకాంత్‌ ఇటీవల వీక్షించారట. సినిమా విడుదలైన రెండో రోజే ప్రత్యేకంగా సినిమాను చూశారట తలైవా. సినిమా చూసిన తర్వాత ‘కేజీయఫ్‌ 2’ టీమ్‌కు ఫోన్‌ చేసి పేరు పేరునా అభినందిస్తూ మాట్లాడారట.

ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌, యశ్‌ యాక్టింగ్‌, ఎలివేషన్‌ సీన్లు, యాక్షన్‌ సీన్స్‌.. ఇలా ప్రతి విషయం గురించి రజనీకాంత్‌ సినిమా టీమ్‌తో మాట్లాడారని తెలుస్తోంది. దీంతో చిత్రబృందం చాలా ఆనందంగా ఉందని సమాచారం. అంతే కదా మరి రజనీకాంత్‌ లాంటి స్టార్‌ హీరో ఫోన్‌ తమ సినిమా గురించి మాట్లాడుతుంటే అలానే ఉంటుంది మరి. ‘కేజీయఫ్‌ 2’ సినిమా రిలీజ్‌ వీకెండ్‌లో భారీ వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా పేరు తెచ్చుకుంది.

కామ్‌స్కోర్‌ లెక్కల ప్రకారం గ్లోబల్‌ బాక్సాఫీస్‌లో ఏప్రిల్‌ 15 నుండి 17 వరకు అంటే మూడు రోజుల్లో అత్యధిక వసూళ్లు రాబటట్టిందట. మొత్తం సినిమా ప్రపంచంలోనే ‘కేజీయఫ్‌ 2’ రెండవ స్థానంలో ఉందట. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఆదివారానికి రూ.500 కోట్ల క్లబ్బులో చేరింది. మొత్తంగా రూ.552 వసూళ్లతో ‘కేజీయఫ్‌ 2’ అదరగొడుతోంది. ఈ జోరు కొనసాగితే రూ. వెయ్యి కోట్లకు ఎన్నో రోజులు పట్టదు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news