సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) , లైకా ప్రొడక్షన్స్ మధ్య సుదీర్ఘ ప్రయాణం ‘రోబో 2.ఓ’తో (Robo 2.0) ప్రారంభమైంది. ఈ సినిమా తరువాత, లైకా ప్రొడక్షన్ తో రజినీకాంత్ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. శంకర్ (Shankar) దర్శకత్వంలో లో వచ్చిన ‘రోబో 2.ఓ’ పెద్ద బడ్జెట్ సినిమాగా రూపొందింది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ, భారీ బడ్జెట్ కారణంగా బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమైంది. ఆ నష్టాలను పూడ్చేందుకు రజినీకాంత్, లైకా తో కలిసి మరిన్ని సినిమాలు చేశారు.
‘దర్బార్’ (Darbar) సినిమాలకు ఏఆర్ మురుగదాస్ (A.R. Murugadoss) దర్శకత్వంలో నటించారు, అయితే ఆ సినిమా కూడా పెద్దగా ఆర్థిక లాభాలను రాబట్టలేదు. తరువాత, కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో ‘లాల్ సలామ్’ (Lal Salaam) సినిమాలో అతిధి పాత్రలో కనిపించి తన ప్రయత్నం కొనసాగించారు, ఆ సినిమా మరింత దెబ్బ కొట్టింది. ఆ సినిమా విషయంలో దర్శకిరాలిగా ఐశ్వర్య చేసిన పొరపాట్లే తీవ్ర నష్టాన్ని కలిగించాయని తమిళ మీడియాలో అనేక రకాల కథనాలు వచ్చాయి. ఇక ఆ తరువాత రజినీకాంత్ లైకా వారితో మరో చిన్న బడ్జెట్ లో సినిమా చేసి మంచి లాభాన్ని తీసుకు రావాలని అనుకున్నారు.
తాజాగా, ‘వేట్టయ్యన్’ (Vettaiyan) అనే సినిమాతో మరోసారి రజినీకాంత్ (Rajinikanth) లైకా తో కలిసి పనిచేశారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) , ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), రానా దగ్గుబాటి (Rana) వంటి ప్రముఖ నటులు కూడా పాల్గొనడంతో బడ్జెట్ పెరిగిపోయింది. అయితే, ఈ సినిమా కూడా భారీ వసూళ్లు సాధించలేకపోయింది. 200 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే రాబట్టడంతో ట్రేడ్ వర్గాలు ఈ సినిమా రన్ తక్కువగా ఉంటుందని భావిస్తున్నాయి.
ఇది కూడా లైకా ప్రొడక్షన్ కి నష్టాలను మిగిల్చింది. ఈ నేపథ్యంలో, లైకా ప్రొడ్యూసర్ రజినీకాంత్ ని మరో సినిమా చేయమని అభ్యర్థించగా, రజినీకాంత్ వెంటనే ఓకే చెప్పినట్లు టాక్. ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘కూలీ’ (Coolie) సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ‘జైలర్’ (Jailer) దర్శకుడు నెల్సన్ దిలీప్ (Nelson Dilip Kumar) తో ఒక సినిమా చేయనున్నారు. ఆ రెండు ప్రాజెక్టుల తరువాత, రజినీకాంత్ లైకా తో మరో సినిమాను చేయడానికి సిద్ధం అవుతారని తెలుస్తోంది.