బాక్సాఫీస్ వద్ద ‘విక్రమ్’ (Vikram) సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ముఖ్యంగా సూర్య ‘రోలెక్స్’ పాత్ర మంచి హైప్ తీసుకొచ్చింది. సినిమా చివరలో కొన్ని నిమిషాలే కనిపించినా, ఆ క్యారెక్టర్ ప్రేక్షకులపై విపరీతమైన ప్రభావం చూపింది. సినిమాలో క్లైమాక్స్ లో రోలెక్స్ విలనిజం ఆడియన్స్ మదిలో నిలిచిపోయింది. ఆ పాత్రకు వచ్చిన ప్రత్యేక క్రేజ్ చూసిన దర్శకుడు లోకేశ్ ఒక పూర్తి స్థాయి సినిమాగా రోలెక్స్ స్టోరీని తీసుకురావాలని నిర్ణయించారు.
ఇటీవల సూర్య (Suriya) ‘కంగువా’ (Kanguva) ప్రమోషన్‌లో పాల్గొంటూ, రోలెక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోలెక్స్ సినిమా కథ కూడా గతంలో తాను చేసిన ఒక సినిమా కథకు లింక్ ఉంటుందని చెప్పి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచారు. ఈ లింక్ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా, సూర్య వ్యాఖ్యలు రోలెక్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.
ఇకపోతే, ‘కంగువా’ నవంబర్ 14న విడుదల కానుండగా, సూర్య మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. పీరియాడిక్ యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా సూర్య ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొల్పింది. ప్రమోషన్‌లో భాగంగా సూర్య రోలెక్స్ సినిమాపై ఇంకా ఎక్కువ చర్చలు జరగాలనే కృషి చేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ తో (Rajinikanth) ‘కూలీ’ (Coolie) మూవీ తెరకెక్కిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రోలెక్స్ స్టాండలోన్ సినిమా పట్టాలెక్కుతుందని ఇప్పటికే ఆయన హింట్ ఇచ్చారు. అలాగే రోలెక్స్ పాత్రకు వచ్చిన క్రేజ్ ను, లోకేశ్ తన సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో పీక్ స్టోరీగా తీసుకురావాలని అనుకుంటున్నారు. ‘విక్రమ్’, ‘ఖైదీ’ (Kaith) , ‘రోలెక్స్’ వంటి అన్ని పాత్రలను కలిపి మరింత పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు.