జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదవ్వడం, ప్రస్తుతం ఆయన జైల్లో ఉండటం.. అనేవి పాత విషయాలే. అయితే జానీ మాస్టర్ కి అందాల్సిన నేషనల్ అవార్డు కూడా హోల్డ్ లో పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆ విషయమై కొద్దిరోజుల క్రితం గట్టిగా చర్చ జరిగింది. ఈ విషయాలపై ఇప్పటికే ఆట సందీప్ వంటి కొరియోగ్రాఫర్స్ స్పందించారు. టాలెంట్ ని పర్సనల్ లైఫ్ ని పోల్చి ఇలా చేయడం సబబు కాదు అంటూ అంతా అభిప్రాయపడ్డారు.తాజాగా ఈ విషయాల పై కొరియోగ్రాఫర్ కమ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినటువంటి యానీ మాస్టర్ (Anee Master) ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.
ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. “జానీపై (Jani Master) కేసు నమోదవ్వడం నాకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆయనకు దక్కాల్సిన నేషనల్ అవార్డ్ క్యాన్సిల్ చేయడం కూడా బాధాకరం. అది టాలెంట్ ను గుర్తించి ఒక తెలుగు టెక్నీషియన్‌కి ప్రకటించిన పురస్కారం. జానీ తప్పు చేసినట్లు ఇంకా ఫ్రూవ్ అవ్వలేదు. గతంలో నేను కూడా జానీ మాస్టర్ వద్ద పనిచేశాను. దాదాపు 2 ఏళ్ళ పాటు ఆయన వద్ద పని చేయడం జరిగింది. ఆయన దగ్గర పని చేసినప్పుడు చాలా ఆనందంగా ఉండేది.
జానీ మంచివాడు.ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడం నేను కూడా జీర్ణించుకోలేకపోతున్నాను. జానీ తప్పు చేసుంటే ఆయనకు శిక్ష పడాలి.. ఒకవేళ ఆయన నిరపరాధి అని తేలితే అప్పుడు ఏంటి?” అంటూ ప్రశ్నించారు యానీ మాస్టర్. మరోపక్క జానీ మాస్టర్ ఇష్యూ పై ఎక్కువమంది స్పందించకపోవడంపై కూడా యానీ క్లారిటీ ఇచ్చారు. “జానీ మాస్టర్ కేసు అనేది సెన్సిటివ్ ఇష్యూ. అందుకే డ్యాన్సర్స్ యూనియన్ కానీ,వేరే మాస్టర్స్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.
డ్యాన్సర్స్ యూనియన్ లో ఎవరికైనా డబ్బుల విషయంలో ఇబ్బంది ఏర్పడితే.. అందరికంటే ముందు నిలబడేది శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్,భాను మాస్టర్. ఇంకో విషయం ఏంటంటే బాధితురాలికి.. డ్యాన్సర్స్ అసోసియేషన్ లో కార్డ్ ఇప్పించిందే జానీ మాస్టర్, ఆయన భార్య సుమలత. ‘ఆ అమ్మాయికి కార్డు ఇవ్వాలి’ అంటూ జానీ మాస్టర్ గ్రూప్ లో మాట్లాడారు..పోరాడారు. ఇక ఏది ఏమైనా.. జానీ మాస్టర్ కేసు జడ్జిమెంట్ కోసం అందరం ఎదురుచూస్తున్నాం” అంటూ యానీ (Anee Master) మాస్టర్ చెప్పుకొచ్చారు.
#JaniMaster కి నేషనల్ అవార్డ్ క్యాన్సిల్ చేయడం చాలా బాధాకరం.: #AneeMaster pic.twitter.com/KH9rkvnl1D
— Filmy Focus (@FilmyFocus) October 18, 2024