పాపం లక్షల రూపాయలకు ఆశపడి తమ సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన హీరోయిన్లు ఇప్పుడు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆల్రెడీ భారతీయ న్యాయ వ్యవస్థ ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయవద్దు అని సెలబ్రిటీలకు మొట్టికాయ వేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు తాజాగా ఈ బెట్టింగ్ యాప్ దందాలో చిక్కుకొని పోలీసులు కస్టడీలోకి తీసుకునే స్థాయికి వెళ్లింది తమన్నా (Tamanna Bhatia) పరిస్థితి.
“మహదేవ్” అనే బెట్టింగ్ యాప్ ను భారీగా ప్రమోట్ చేసింది తమన్నా (Tamanna Bhatia) . అందుకోసం లక్షల రూపాయల మొత్తాన్ని రుసుముగా స్వీకరించింది. అయితే.. ఈ లావాదేవీలన్నీ క్యాష్ రూపంలో జరిగాయి. మొన్నామధ్య సదరు యాప్ లావాదేవీలలను చెక్ చేసిన ఈడీ సంస్థ ఎక్కువశాతం డబ్బులు తమన్నాకు చెల్లించినట్లు గుర్తించారు. అందుకే నిన్న ఉదయం తమన్నాను మరియు డబ్బులు స్వీకరించిన తమన్నా తండ్రి సంతోష్ భాటియాను ఈడీ పోలీసులు కస్టడీలోకి తీసుకొని దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించారు.
ఈడీ కస్టడీ నుండి బయటకు వస్తున్న తమన్నా(Tamanna Bhatia) వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రశ్నించే తతంగం జరుగుతున్నంతసేపు తమన్నా తల్లి రజినీ భాటియా ఆఫీస్ బయట కారులోనే వేచి ఉన్నారట. అయితే.. ఈ కేసు విషయంలో తమన్నా ఇన్వాల్వ్మెంట్ ఏమిటి? నిజంగానే ఈడీ ప్రశ్నించే స్థాయి డబ్బులు తమన్నా సంపాదించిందా? ముంబై మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు సదరు మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రైవేట్ ఈవెంట్స్ కు తమన్నా గెస్ట్ గా హాజరైందా? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.
త్వరలో బాలీవుడ్ లో స్థిరపడ్డ హైదరాబాద్ నటుడు విజయ్ వర్మను పెళ్లాడి సెటిల్ అయ్యేందుకు సిద్ధమవుతున్న తమన్నాకు ఈ ఈడీ కేస్ పుణ్యమా అని లేనిపోని పబ్లిసిటీ యాడ్ అయ్యింది. మరి ఈ కేస్ నుంచి ఆమె ఎలా బయటపడుతుందో చూడాలి.
Tamanna Bhatia pic.twitter.com/uvW3okeziE
— Amit Kumar (@AmitKumar8165) October 18, 2024