రజినీతో రష్మీ పోటీ!

  • July 12, 2016 / 09:54 AM IST

కథతో సంబంధం లేకుండా తన హాట్ హాట్ ఎక్స్పొజింగ్ తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది రష్మీ. రీసెంట్ గా విడుదలయిన తన రెండు సినిమాల్లో ఈ భామ అందాల ప్రదర్శనకే పరిమితమయింది. అయితే ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో పోటీ పడడానికి సిద్ధమయింది. రష్మీ ప్రధాన పాత్రలో నటించిన ‘రాణిగారి బంగ్లా’ చిత్రాన్ని ‘కబాలి’ సినిమా రిలీజ్ రోజే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కబాలి సినిమా కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు టికెట్స్ దొరకక కనీసం సగం మందైనా తమ సినిమాకు వస్తే చాలని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఎలాగో సినిమాలో రష్మీ ఉంది కాబట్టి ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతుంది. అందుకే ధైర్యంగా సినిమాను విడుదల చేస్తున్నారు. మరి ఈ హారర్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను మెప్పిస్తుందో.. లేదో.. చూడాలి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus