Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’
- April 5, 2026 / 05:02 PM ISTByPhani Kumar
నిర్మాతగా చేసిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’తో భారీ విజయాన్ని అందుకుంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. దీని తర్వాత హారర్ ఫాంటసీ జోనర్లో ‘రాకస'(Raakaasaa) చేసింది.
Raakaasaa
సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాతో మానస శర్మ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. గెటప్ శీను, వెన్నెలకిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.

కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో ప్రీమియర్స్ షోలు కూడా వేశారు. వాటికి పాజిటివ్ టాక్ వచ్చింది.దీంతో బాక్సాఫీస్ వద్ద బాగానే ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే
| తెలంగాణ | 0.65 cr |
| సీడెడ్ | 0.25 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.70 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.6 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.80 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 2.4 cr(షేర్) |
‘రాకాస’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.14.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.15 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ప్రీమియర్స్ షోలతో కలుపుకుని మొదటి రోజు రూ.2.4 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.4.45 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.12.6 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.
‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’













