రాఖీ సావంత్ (Rakhi Sawant) అందరికీ తెలుసు. బాలీవుడ్ లో మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆమె బుల్లితెర పై షోలతో మారేంత పాపులర్ అయ్యింది. అదే సమయంలో ఈమెకు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసే ఛాన్సులు లభించాయి. అటు తర్వాత ఈమె బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొని హాట్ టాపిక్ అయ్యింది. నిత్యం ఈమె వేరే సెలబ్రిటీల గురించి నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది.
గతంలో ‘మీటూ’ లో భాగంగా తను శ్రీ దత్తా గురించి ఈమె చేసిన నెగిటివ్ కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. తాజాగా ఈమె హాస్పిటల్ అడ్మిట్ అయినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా చర్చనీయాంశం అయ్యాయి. విషయం ఏంటంటే.. రాఖీ సావంత్ తీవ్ర గుండె జబ్బుతో హాస్పిటల్లో చేరినట్టు ప్రచారం జరుగుతుంది. హిందా పాపారాజి వైరల్ భయానీ.. తన ఇన్స్టాగ్రామ్లో రాఖీ సావంత్ హాస్పిటల్చి బెడ్ పై ఉన్న ఫోటోలు షేర్ చేశారు.
ఆమె వేలికి ఆక్సీమీటర్, అలాగే చేతికి వైగో పెట్టి ఉండటం.. గ్లూకోజ్ ఎక్కిస్తూ ఉండటాన్ని కూడా మనం గమనించవచ్చు. ‘ఆమె పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది’ అని నెటిజన్లు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది ‘రాఖీ సావంత్ ప్రాంక్ చేస్తుందా?’ అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో రాఖీ సావంత్ ఇలాంటి ప్రాంక్..లు చేసిన సందర్భాలు ఉన్నాయి.