Double Ismart Teaser: డబుల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందో తెలుసా?
- May 15, 2024 / 11:11 AM ISTByFilmy Focus
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) , ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Ram) కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ (iSmart Shankar) మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలుసు. 2019 జూలై 18 న రిలీజ్ అయిన ఈ చిత్రం పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బయ్యర్స్ కి డబుల్ ప్రాఫిట్స్ అందించింది. దీనికి ముందు పూరీ జగన్నాథ్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. రామ్ కూడా ఒకే రకమైన స్టోరీలు చేస్తున్నాడు అనే విమర్శలు ఎదుర్కొన్నాడు.

అలాంటి టైమ్లో జతకట్టిన వీరిద్దరూ ఇస్మార్ట్ శంకర్ తో పెద్ద హిట్ కొట్టి ఫామ్లోకి వచ్చారు. ఇక 5 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ అయ్యింది. 86 సెకన్ల నిడివి కలిగిన ఈ సినిమా టీజర్.. కంప్లీట్ గా యాక్షన్ మోడ్లో సాగింది. ‘నాకు తెలీకుండా నాపై సినిమా ప్లాన్ చేస్తే గుడ్డులో మండుతుంది ‘ వంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి.

అలాగే సంజయ్ దత్ (Sanjay Dutt) స్టయిలిష్ విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. కావ్య థాఫర్ (Kavya Thapar) హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్ లో ఆమె మార్క్ గ్లామర్ కూడా హైలెట్ అయ్యింది. మణిశర్మ (Mani Sharma) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అట్రాక్ట్ చేసింది. టీజర్ చివర్లో మరోసారి పరమ శివుడి బ్యాక్ డ్రాప్ లో ఒక ట్రాక్ ఉన్నట్లు కూడా చూపించారు. మీరు కూడా ఒకసారి చూడండి:













