ప్రముఖ నటికి సర్జెరీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

  • September 2, 2022 / 01:55 PM IST

రాఖీ సావంత్.. ఈ పేరు ‘మీటూ’ టైంలో బాగా పాపులర్ అయ్యింది. లైంగిక ఆరోపణలు చేసిన తనుశ్రీ దత్తా పై ఈమె చేసిన ఘోరమైన కామెంట్లతో ఇండియా వైడ్ హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్‌లో ఐటం సాంగ్స్‌తో పాపులర్ అయిన ఈమె సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన ‘బిగ్‌బాస్‌’ రియాలిటీ షోలో కూడా పాల్గొని వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనిపించుకుంది. అటు తర్వాత భర్త రితేశ్‌ సింగ్‌తో విడిపోయి,

కొద్దిరోజుల్లోనే బిజినెస్‌మెన్‌తో లవ్‌ లో పడటం, ఎంగేజ్‌మెంట్‌..చేసుకోవడం, ఇలా హాట్ టాపిక్స్ లో ముందుండేది. తనకంటే 6 ఏళ్ళు చిన్నవాడైన అదిల్‌ దురానీతో డేటింగ్ చేస్తున్న ఈమె ముంబై రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ వచ్చింది.ఎంతో మంది ఈమెను వదిలెయ్యమని అదిల్‌ దురానీతో చెప్పినా అతను మాత్రం ఈమె ప్రేమలో పూర్తిగా మునిగిపోయాడు. ఇదిలా ఉండగా..ఇటీవల రాఖీ సావంత్ కి మేజర్ సర్జరీ జరిగిందనే వార్త పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయ్యింది.

మొత్తానికి ఈ విషయం పై రాఖీ తన అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. గర్భాశయంలో కణితి వల్ల ఈమె తీవ్రంగా కడుపు నొప్పికి గురైందట. దీంతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపింది. ముంబైలోని క్రిటికేర్ హాస్పిటల్ జుహులో సుమారు 4 గంటలపాటు ఈమెకు శస్త్రచికిత్స చేశారట వైద్యులు. సర్జరీ అనంతరం చాలా వీక్ గా ఉన్నట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ‘గెట్ వెల్ సూన్’ అనే కామెంట్లు పెడుతున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus