“అల్లుడు శీను”తో కెరీర్ ను ప్రారంభించిన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా మారి అయిదేళ్లు పూర్తైనా.. కమర్షియల్ సక్సెస్ ను మాత్రం టేస్ట్ చేయలేకపోయాడు. ఎట్టకేలకు “రాక్షసుడు”తో ఫస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకొన్నాడు. ఊహించవి విధంగా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ రావడమే కాదు.. ఆదివారం నుంచి థియేటర్లు కూడా పెంచారు. దాంతో బెల్లంకొండ కెరీర్ లో మంచి కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగానూ “రాక్షసుడు” నిలవనుందని విశ్లేషకులు, ట్రేడ్ పండిట్స్ ఫిక్స్ అయిపోయారు.
అయితే.. తెలుగు రాష్ట్రాల వరకూ రిసెప్షన్ బాగానే ఉన్నప్పటికీ.. ఓవర్సీస్ లో మాత్రం కనీస స్థాయి కలెక్షన్స్ ను రాబట్టలేకపోతోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు.. “రాక్షసుడు” ఒరిజినల్ అయిన “రాట్శసన్”ను ఓవర్సీస్ ఆడియన్స్ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా ఒకటికి రెండుసార్లు చూసేసి ఉండడం.. తెలుగు వెర్షన్ యాజిటీజ్ గా తీయడంతో.. అన్నేసి డాలర్లు పోసి తెలుగు వెర్షన్ చూడడం ఎందుకులే అని లైట్ తీసుకొన్నారు. ఆ కారణంగా “రాక్షసుడు” ఓవర్సీస్ లో మాత్రం ఫ్లాప్ గా మిగిలిపోయింది.