బెల్లంకొండ మార్కెట్ బాగానే ఉందే.. మరి సినిమా ఏమవుతుందో..?

  • August 1, 2019 / 04:51 PM IST

ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్ళు పూర్తి కావస్తున్నా ఇంకా హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ‘అల్లుడు శీను’ ‘జయ జానకి నాయక’ వంటి సినిమాలు పర్వాలేదనిపించినా అవి డైరెక్టర్ల అకౌంట్ లోకి వెళ్ళిపోయాయి. ఆ తరువాత చేసిన ‘సాక్ష్యం’ ‘కవచం’ ‘సీత’ వంటి చిత్రాలు కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో ఎలాగైనా హిట్టందుకోవాలని .. తమిళంలో సూపర్ హిట్టయిన ‘రాట్ససన్’ రీమేక్ ను ఎంచుకున్నాడు. ‘రైడ్’ ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం ఆగష్టు 2 న (రేపు) విడుదల కానుంది. ఆల్రెడీ అక్కడ సూపర్ హిట్టయిన సినిమా కాబట్టి… ఈ చిత్రానికి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

‘రాక్షసుడు’ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 5.50 కోట్లు
సీడెడ్ – 2.0 కోట్లు
వైజాగ్ – 1.50 కోట్లు


ఈస్ట్ – 0.95 కోట్లు
వెస్ట్ – 0.85 కోట్లు
కృష్ణా – 1.00 కోట్లు


గుంటూరు – 1.20 కోట్లు
నెల్లూరు – 0.50 కోట్లు
———————————————————
నైజాం + ఏపీ (టోటల్) – 13.50 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా – 0.7 కోట్లు


కర్ణాటక – 1.1 కోట్లు
ఓవర్సీస్ – 0.7 కోట్లు
————————————————————-
వరల్డ్ వైడ్ టోటల్ – 16 కోట్లు
————————————————————–

‘రాక్షసుడు’ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 16 కోట్ల (షేర్) వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే అది మొదటి వారంలోనే రాబట్టాలి ఎందుకంటే రెండో వారం ‘మన్మధుడు2’ వచ్చేస్తుంది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే తప్ప… అది సాధ్యం కాదు. ఈ చిత్రానికి బిజినెస్ బాగా జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ అయితే మాత్రం బెల్లంకొండ గట్టెక్కేసినట్టే. తద్వారా తన మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ చిత్రం బెల్లంకొండ శ్రీనివాస్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus