అందుకే బెల్లంబాబు సినిమా ఇంత త్వరగా రెడీ అయిపోయింది..!

పాపం ఒక్క హిట్టు కోసం హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్ పడని కష్టమంటూ లేదు. ఇటీవల శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘సీత’ చిత్రం కూడా నిరాశపరిచింది. కాజల్ స్టార్ డం, తేజ వంటి డైరెక్టర్ కూడా ఈ చిత్రాన్ని ప్లాప్ నుండీ కాపాడలేకపోయారు. దీంతో ఇప్పుడు తన ఆశలన్నీ తన తరువాత సినిమా ‘రాక్ష‌సుడు’ వస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్లో సూపర్ హిట్టయిన ‘రాచ్చ‌స‌న్‌’ సినిమాకి ఇది రీమేక్‌. ఈ చిత్రం షూటింగ్ కూడా దాదాపు పూర్తికావొచ్చిందట. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం టీజ‌ర్ ఇటీవల విడుద‌ల చేశారు.

అయితే అత్యంత వేగంగా ఈ చిత్రాన్ని ఎలా పూర్తి చేసారా అనే సందేహం ప్రతీ ఒక్కరిలోనూ ఉంది. అయితే … ఈ సినిమాలో స‌గం పైనే ఒరిజినల్ అంటే ‘రాచ్చ‌స‌న్‌’ సీన్లే వాడేసారట. విడుదలైన టీజ‌ర్లో క‌నిపించిన షాట్స్ అన్నీ ఒరిజినల్ సినిమాలోనివేనని తెలుస్తుంది. ‘రాచ్చ‌స‌న్‌’లో న‌టించిన న‌టీన‌టులు ఈ రీమేక్‌లోనూ క‌నిపిస్తారట. సో వాళ్ళతో ఉండే సీన్లన్నీ ఒరిజినల్ లోనివే తెచ్చేసుకున్నారట. బెల్లంకొండ, అనుపమ మధ్య వచ్చే సీన్లను మాత్రం కొత్తగా తీసారట. అందుకే సినిమాని ఇంత త్వరగా పూర్తిచేశారని తెలుస్తుంది. మరి ఈ సూపర్ హిట్ రీమేక్ తో అయినా బెల్లం బాబు హిట్టు కొడతాడేమో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus