నేను కలిసి నటించిన బెస్ట్ హీరో, నా బెస్ట్ కో యాక్టర్ అనే హీరోయిన్లు చాలా రెగ్యులర్ గా తమతో కలిసి నటించిన హీరో గురించి చెప్పే మాటలు. కానీ.. అందరికంటే భిన్నంగా రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తనతో కలిసి రెండు సినిమాల్లో నటించిన రామ్ చరణ్ గురించి ఒక డిఫరెంట్ కామెంట్ చేసింది. ఎన్టీఆర్ ఇండస్ట్రీకి దొరికిన వరం, మహేష్ బాబు ప్రొఫెషనల్ అంటూ తనతో కలిసి నటించిన హీరోల గురించి మంచి కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. “రామ్ చరణ్ ని చూసినప్పుడల్లా నాకు చిన్నపిల్లాడ్ని చూసినట్లు అనిపిస్తుంది” అంటూ రకుల్ చేసిన కామెంట్ ప్రస్తుతం సెన్సేషన్ అయ్యింది.
రామ్ చరణ్ అందరితో చాలా సరదాగా ఉంటూనే హుందాగా వ్యవహరిస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే రకుల్ ఈ విధంగా స్టేట్ మెంట్ ఇచ్చాడేమో అని మెగా అభిమానులందరూ భావిస్తున్నారు. అలాగే.. తాను కేవలం డేట్స్ లేకపోవడం వల్ల తెలుగు సినిమాల్లో నటించడం లేదు కానీ.. తనకు ఆఫర్లు రావడం లేదంటూ సోషల్ మీడియా మరియు వెబ్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని రకుల్ స్పష్టం చేయడం గమనార్హం.