Rakul Preet: వైరల్ అవుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ పోస్ట్..!

రకుల్ ప్రీత్ సింగ్.. ఈ భామకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రభాస్ కజిన్ నటించిన ‘కెరటం’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు. తర్వాత ప్రభాస్ నటించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలోనే ఛాన్స్ కొట్టింది. కానీ కొంత షూట్ కంప్లీట్ అయ్యాక ఈమెను తీసేసి కాజల్ ను పెట్టారు. అయితే ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీతో ఈమెకు మంచి సక్సెస్ అందింది.ఆ తర్వాత వరుసగా క్రేజీ ఆఫర్లు అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

అయితే కొన్నాళ్లుగా ఈ అమ్మడికి సరైన అవకాశాలు లభించడం లేదు. యంగ్ హీరోలతో చేసిన సినిమాలు అన్నీ ప్లాప్ అవుతున్నాయి. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నా.. అక్కడ కూడా ఈ అమ్మడు క్లిక్ అవ్వలేకపోతుంది. అయినప్పటికీ అక్కడ ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఏర్పడింది. అందువల్ల ఈమెకు అవకాశాలు లభిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. రకుల్ ప్రీత్ సింగ్ ఇంట విషాదం చోటు చేసుకుందట. రకుల్ తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది.

విషయం ఏంటి అంటే.. ’16 ఏళ్లుగా రకుల్ ఫ్యామిలీ ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా పెంచుకుంటున్న బ్లోసమ్ అనే పెంపుడు కుక్క కన్నుమూసిందట. అది చనిపోవడంతో రకుల్ ఎంతో ఎమోషనల్ అయ్యిందని తెలుస్తుంది. బ్లోసమ్ తో రకుల్ దిగిన పిక్స్ ను షేర్ చేస్తూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది రకుల్.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus