ఎన్టీఆర్ బయోపిక్ కోసం భారీ రెమ్యునరేషన్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్

ఎన్టీఆర్ బయోపిక్ పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. మహానటుడు భార్య బసవతారకమ్మ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ నటిస్తోంది. ఏఎన్నార్ గా సుమంత్, కృష్ణ గా సుధీర్ బాబు, చంద్రబాబు నాయుడిగా రానా నటించనున్న ఈ చిత్రంలో నరేష్ నిర్మాత బొగట వెంకట సుబ్బారావు పాత్రలో కనిపించనున్నారు. ఇక ఎన్టీఆర్ అనేక మంది హీరోయిన్స్ తో కలిసి నటించారు. అందుకే శ్రీదేవి పాత్రకోసం రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్నారు. ఒకప్పటి “వేటగాడు” చిత్రంలో ఆకుచాటు పిందె తడిసే పాటకు సంబంధించిన స్టిల్ కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఆ స్టిల్ మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అయింది.

ఎందుకంటే ఈ సినిమాలో రకుల్ కనిపించేది కొన్ని సన్నివేశాలే అయినప్పటికీ కోటి రూపాయలు అందుకున్నట్టు తెలిసింది. రకుల్ కి తెలుగుతో పాటు.. తమిళం.. హిందీలోనూ అభిమానులు ఉన్నారు. అందుకే రకుల్ కి అంత ముట్టచెప్పినట్టు సమాచారం. బయోపిక్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ లో సినిమా లైఫ్ ని చూపించబోతున్నారు. ఇందుకు ‘కథానాయకుడు’ అనే అటైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ జనవరి 9 న రిలీజ్ కానుంది. ఇందులోనే ఎన్టీఆర్, శ్రీదేవి జోడీ అలరించనుంది. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి బాలయ్య నిర్మిస్తున్న ఈ సినిమాల కోసం నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus