Rakul Preet: ‘కొండపొలం’.. ఆ రెండు సినిమాలకు సమానం: రకుల్‌

  • October 7, 2021 / 01:38 PM IST

ఏవైనా రెండు సినిమాలను పోల్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే రెండు రకాల సమస్యలు వస్తాయి. ప్రస్తుతం అలాంటి సమస్యల్నే కొని తెచ్చుకుంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ‘కొండపొలం’ సినిమా విడుదల సందర్భంగా ఇటీవల రకుల్‌ప్రీత్‌ మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా తమ సినిమాని ఆకాశానికెత్తేసింది. అంతవరకు ఫర్వాలేదు. కానీ ఆ సినిమా ఏకంగా భారతీయ సినిమా లెజెండ్‌ మూవీస్‌తో పోల్చింది రకుల్‌. ఫలానా పాత్రలు చేయాలని లక్ష్యాలేమీ పెట్టుకోలేదట రకుల్‌…

అయితే చేసిన సినిమా మాత్రం జీవితాంతం ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా ఉండాలి. ఓ ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే’, ఓ ‘బాహుబలి’లా ప్రేక్షకులకు మరపురాని సినిమాలా మారాలి అని చెప్పుకొచ్చింది. మంచిది అని అభిమానులు అనుకునేలోగా… ఇలాంటి చిత్రాల జాబితాలో ‘కొండపొలం’ ఉంటుందని నమ్ముతున్నా అంటూ బాంబు పేల్చింది. ఇండస్ట్రీ మొత్తం అదిరిపోయే సినిమా చేయాలనుకుకోవడం తప్పుకాదు. కానీ అంత పెద్ద సినిమాలతో రాబోయే సినిమాను పోల్చడం సాహసమే.

ఓవర్‌ హైప్‌ ఎప్పుడూ సినిమా మీద ప్రభావం చూపిస్తుందని కొత్తగా చెప్పక్కర్లేదు. ఆమెకు కూడా తెలిసే ఉంటుంది. అయితే ‘కొండపొలం’ ఆ స్థాయి సినిమా కాదా… అంటే విడుదలయ్యాక తెలుస్తుంది. ఇప్పటికైతే అలాంటి బజ్‌ ఏమీ లేదనే చెప్పాలి.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus