Rakul Preet: తల్లిదండ్రుల ఇష్టంతోనే ఆ సినిమాలో నటించా.. క్లారిటీ ఇచ్చిన రకుల్!

  • October 12, 2022 / 08:46 PM IST

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రకుల్ ప్రీతిసింగ్ అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయారు. ఈమె కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళంలో కూడా నటిగా గుర్తింపు పొందిన అనంతరం బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ తెలుగు తమిళ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

అయితే తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన కొన్ని సినిమాలకు తన తల్లిదండ్రులు ఏమాత్రం ఒప్పుకోలేదని,వారికి ఇష్టం లేకపోయినా ఈమె సినిమాలలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై రకుల్ ప్రీతిసింగ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో రకుల్ నటించిన ఛత్రివాలి, డాక్టర్ జి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి అయితే ఈ రెండు సినిమాలలోను రకుల్ ప్రీతిసింగ్ విభిన్న పాత్రలలో నటించారు.

ఛత్రివాలి సినిమాలో ఈమె కండోమ్ టెస్టర్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు అదే విధంగా డాక్టర్ జి చిత్రంలో కూడా ఈమె కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలలో నటించడానికి తల్లిదండ్రులు అభ్యంతరకరం వ్యక్తం చేశారని వార్తలపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఖండించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ నా తల్లిదండ్రులు నాకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.

వాళ్లు నన్ను పూర్తిగా సపోర్ట్ చేశారని తెలిపారు. ఇక డాక్టర్ జి సినిమాలో ఆయుష్మాన్ ఖురాన్ గైనకాలజిస్ట్ గా కనిపించనున్నారు. అయితే మన దేశంలో ఒక పురుషుడు గైనకాలజిస్ట్ గా ఉండటాన్ని నిషేధించడం దురదృష్టకరం ఒక కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ మగవారు ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ ఎందుకు ఉండరు వాళ్లు డాక్టర్లు ఒక పేషంట్ కి వైద్యం చేయడమే వారి పని అది ఆడ మగ అనే వ్యత్యాసం లేదని ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus