‘దేవ్’ చిత్రం కోసం రకుల్ మాస్టర్ ప్లాన్ ..?

‘జయ జానకి నాయక’ చిత్రం తరువాత కోలీవుడ్ వైపు మళ్ళింది రకుల్ ప్రీత్ సింగ్. మధ్యలో మహేష్ బాబుతో చేసిన ‘స్పైడ‌ర్‌’ వచ్చినప్పటికీ అది కూడా చాలా వరకూ తమిళ్ చిత్రమే అని చెప్పొచ్చు. అప్పటి నుండీ తెలుగులో హీరోయిన్ గా నటించలేదు. ఇటీవల వచ్చిన ‘ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు’ చిత్రంలో శ్రీ‌దేవి పాత్ర చేసినప్పటికీ.. అది సినిమాలో 5 నిముషాలు కూడా లేదు అనే కామెంట్స్ వినిపించాయి. ప్రస్తుతం రకుల్… కార్తీ తో నటించిన ‘దేవ్‌’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఖాకీ’ చిత్రం తెలుగులో కూడా మంచి హిట్ అందుకుంది. దీంతో ‘దేవ్‌’ చిత్రం పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఎలాగైనా తనకి హిట్ ఇస్తుందని ర‌కుల్ భావిస్తుంది. ఈ హిట్ట‌తో.. తెలుగులో మరిన్ని అవ‌కాశాలు సంపాదించుకోవ‌చ్చ‌ని ర‌కుల్ ప్లాన్. వీటితో పాటు నాగ చైతన్యకు జోడిగా ‘వెంకీమామ’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది రకుల్. ఈ రెండు చిత్రాలు హిట్టయితే.. కుర్ర హీరోయిన్ల పోటీకి రకుల్ నిలబడి మరిన్ని అవకాశాలు దక్కించుకునే అవకాశం ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ‘దేవ్’ చిత్రాన్ని వీలైనంత ఎక్కువ‌గా ప్ర‌మోట్ చేసుకోవాల‌ని రకుల్ చూస్తుంది. ఈ చిత్ర నిర్మాత‌లు, టీమ్‌తో సంబంధం లేకుండా.. రకుల్ త‌న సొంత టీంతో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తుందని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.ఇక ర‌జ‌త్ ర‌విశంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘దేవ్’ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కాబోతుంది. మ‌రి ర‌కుల్ ప్లాన్ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus