Rakul Preet Singh: సినిమాల్లోకి రాకపోతే ప్లాన్ బి రెడీ చేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ !

Advertisement

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో పూర్తిగా సినిమాలను తగ్గించేసింది. హిందీలో మాత్రం ఓ రెండు సినిమాలను చేస్తోంది. రకుల్ ప్రీత్ హిందీలో తాజాగా ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాను చేసింది. ఇటీవలే ఈసినిమా ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాలో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటించింది. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించారు. ఇక అది అలా ఉంటే రకుల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తాజా సమాచారం.

గతంలో కూడా రకుల్ పెళ్లిపై రూమర్స్ రాగా.. మరోసారి ఆమె పెళ్లిపై రూమర్స్ గుప్పుమన్నాయి. రకుల్ అతి త్వరలో హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంటున్న తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని సమాచారం. ఇప్పటికే ఈ ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చనున్నారట.

ఈ విషయంలో త్వరలో రకుల్ (Rakul Preet Singh) ఓ ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు నటి కాకపోయి ఉంటే ఏమయ్యేదో చెప్పి షాక్ ఇచ్చింది. తాను అనుకున్న సమయానికి సినిమా అవకాశాలు రాకపోతే ‘ప్లాన్‌ బీ’గా ఎం.బి.ఎ (ఫ్యాషన్‌) చేద్దామని నిర్ణయించుకున్నట్టు రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. అయితే, అదృష్టం కొద్దీ అలా జరగలేదని, ప్రణాళిక ప్రకారమే నటిని అయ్యానని చెప్పారు.

తాజాగా ఓ ‘పాడ్‌కాస్ట్‌’ వేదికగా అప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ముందుగా మోడల్‌గా మారి, ‘మిస్‌ ఇండియా’ పోటీల్లో పాల్గొంటే గుర్తింపు లభిస్తుందని, దాని వల్ల నటిగా అవకాశాలు వస్తాయని సినీ రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఆమె సూచించారు. తాను మ్యాథ్స్‌ గ్రాడ్యుయేట్‌ అని తెలిపారు. సుమారు 18 ఏళ్ల వయసులోనే సినిమాలో నటించే అవకాశం వచ్చిందన్నారు.తనది ఆర్మీ కుటుంబ నేపథ్యంకావడంతో చిన్నప్పటి నుంచీ క్రమశిక్షణ అలవడిందని, తన కెరీర్‌ను తీర్చిదిద్దడంలో అది ఎంతగానో సహకరించిందని పేర్కొన్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus