“స్పైడర్” లాంటి డిజాస్టర్ తర్వాత మొన్నామధ్య సైన్ చేసిన “వెంకీ మామ” తప్ప చేతిలో మరో సినిమా లేని రకుల్ ప్రీత్ సింగ్ ఏంటీ.. ప్రస్తుతం టాప్ హీరోయిన్ హోదాను ఎంజాయ్ చేస్తున్న సమంతను రీప్లేస్ చేయడం ఏంటీ? అదెలా సాధ్యపడింది అనుకొంటున్నారా?. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మన రకుల్ ప్రీత్ సింగ్ ఆమె కంటెంపరరీ హీరోయిన్ అయిన సమంతను రీప్లేస్ చేసింది ఏదో సినిమాలో కాదు.. ఒక యాడ్ ఫిలిమ్ లో.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. మొన్నటివరకూ సమంత ప్రచారకర్తగా వ్యవహరించిన “మజా” బ్రాండ్ కూల్ డ్రింక్ కి ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఈమధ్యే ఆమెపై తెరకెక్కించిన టెలి ఫిలింస్ కూడా ప్రసారం మొదలెట్టారు. చూస్తుంటే.. రకుల్ మెల్లమెల్లగా తెలుగులో కోల్పోయిన తన స్టార్ డమ్ ను తిరిగి పొందే పనిలో బిజీగా ఉందని అర్ధమవుతోంది. మరి ఈ యాడ్ ఫిలిమ్స్ మాత్రమే కాకుండా ఏదైనా ఫీచర్ ఫిలిమ్ కూడా రకుల్ తెలుగులో సైన్ చేస్తే బాగుండు.