వామ్మో.. మరో క్రేజీ కాంబినేషన్ కు బాలయ్య ప్లాన్ చేశారా?

స్టార్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో సీజన్2 ఫస్ట్ సీజన్ ను మించి హిట్టైన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఎపిసోడ్ కు అంచనాలకు మించి రెస్పాన్స్ వస్తుండగా ఈ నెల 6వ తేదీన ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్2 రిలీజ్ కానుంది. ఈ నెల 13వ తేదీన అన్ స్టాపబుల్ షోలో వీరసింహారెడ్డి స్పెషల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. బాలయ్య పవన్ కాంబో ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా

ఈ ఎపిసోడ్ ఇప్పట్లో రావడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే అన్ స్టాపబుల్ షోకు చరణ్, కేటీఆర్ కలిసి హాజరు కానున్నారని త్వరలో ఈ ఎపిసోడ్ షూట్ జరగనుందని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. చరణ్, కేటీఆర్ మంచి స్నేహితులు కాగా ఈ కాంబినేషన్ లో ఎపిసోడ్ ఉంటే బాగుంటుందని ఆహా నిర్వాహకులు, బాలయ్య ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. చరణ్ అన్ స్టాపబుల్ సీజన్3 లో కనిపించే ఛాన్స్ ఉందని ప్రచారం జరగగా అందుకు భిన్నంగా ఈ సీజన్ లోనే కనిపించనున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ ఎపిసోడ్ లో అన్ స్టాపబుల్ షోకు వస్తానని మాటిచ్చిన చరణ్ ఆ మాటను నిలబెట్టుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చరణ్, కేటీఆర్ కాంబో ఎపిసోడ్ షూట్ ఎప్పుడు జరుగుతుందో చూడాల్సి ఉంది. ఈ ఎపిసోడ్ అటు సినీ వర్గాల్లో ఇటు పొలిటికల్ వర్గాల్లో సెన్సేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.మరోవైపు యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఈ షోలో కనిపించలేదు.

తారక్, కళ్యాణ్ రామ్ కలిసి ఈ షోలో సందడి చేస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆహా నిర్వాహకుల ప్లానింగ్ ఏ విధంగా ఉందో తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు అన్ స్టాపబుల్ షో ప్రసారం కానుందని తెలుస్తోంది. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించడం వల్లే ఈ షో ఈ స్థాయిలో సక్సెస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus