సాధారణమైన మనిషి గొప్పవాడు అవ్వాలంటే అసాధారమణమైన పనులు చేయక్కర్లేదు. సాధారణమైన పనులే చేయాలి, కానీ అవి ఎంతోమంది మనషులను తాకేలా ఉండాలి. అలాంటి పనులను చేసినవారిని అవతలి వ్యక్తి, అతనిని అభిమానించేవారు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలాంటి పనే చేసి, తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు రామ్‌చరణ్. నిజానికి చరణ్ చేసిన పని చాలా చిన్నదే, కానీ అంతటి సెలబ్రిటీ అలా చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రామ్‌చరణ్ ఓ వ్యక్తి బర్త్‌డే ఫంక్షన్లో దగ్గరుండి కేక్ కట్ చేయిస్తున్నాడు,
పక్కనే చరణ్ సతీమణి ఉపాసన కూడా ఉన్నారు. అందులో ఏముంది ఎవరో స్నేహితుడో, కుటుంబ సభ్యుడో అయి ఉండొచ్చు అంటారా. నిజమే, చాలామంది ఇలానే అనుకున్నారు. కానీ ఆ కేక్ కట్ చేసిన వ్యక్తి అందరూ అనుకున్నట్లు ఫ్రెండ్ కాదు, ఫ్యామిలీ మెంబర్ కాదు. ఓ సాధారమైన వ్యక్తి. రామ్‌చరణ్‌కు గత కొన్నేళ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడట. అతని పుట్టిన రోజు వేడుకలో చరణ్ కనిపించాడు. ఇక్కడో విషయం ఏంటంటే..
చరణ్ ఆ వేడుకకు వెళ్లడం కాదు, చేయించిందే చరణ్ అట. ఆ డ్రైవర్ పేరు నరేశ్ అట. చాలా రోజులుగా తన దగ్గర డ్రైవర్‌గా ఉంటున్న నరేశ్ పుట్టిన రోజును ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నారట చరణ్ – ఉపాసన. అందుకే ప్రత్యేకంగా టీమ్‌ను పిలిచి, ఓ కేక్‌ను తెప్పించి కట్ చేయించారట. ఈ క్రమంలో నరేశ్ భుజం మీద చేయేసి మరీ కేట్ కట్ చేయించి వావ్ అనిపించారట రామ్‌చరణ్. ఆ ఫొటోనే ఇప్పుడు వైరల్ అవుతోంది.
తన దగ్గర పని చేసే వ్యక్తుల విషయంలో ప్రేమగా ఉండటం సెలబ్రిటీలకు అలవాటు. కుటుంబ సభ్యుల కంటే వారితోనే ఎక్కువసేపు గడుపుతాం అని చెబుతుంటారు కూడా. అందుకే వారి మధ్య చక్కటి అనుబంధం ఏర్పడుతుందని చెబుతుంటారు. ఇప్పుడు రామ్‌చరణ్ విషయంలోనూ ఇదే చూశాం. చరణ్ గెస్చర్ సూపర్ క్యూట్ కదా. అన్నట్లు చిరంజీవి కూడా తన సిబ్బందితో ఇలానే ఉంటారు అని చెబుతుంటారు.